Gayam 2 : సంచలన దర్శకుడు రాం గోపాల్ వర్మ దర్శకత్వంలో వచ్చి భారీ హిట్ సాధించింది గాయం. 1993, ఏప్రిల్ 22న విడుదలై విమర్శకుల ప్రశంసలు అందుకుంది. ఈ మూవీని ఎస్.ఎస్. క్రియేషన్స్ పతాకంపై, యార్లగడ్డ సురేంద్ర నిర్మించారు. ఈ చిత్రంలో జగపతి బాబు, ఊర్మిళా మండోద్కర్, రేవతి ప్రధాన పాత్రల్లో నటించారు. 1980లలో విజయవాడలో జరిగిన గ్యాంగ్ వార్ఫేర్ ఆధారంగా చేసుకొని వాస్తవ సంఘటనలను కథలో జోడించి రూపొందించారు. ఇక ఈ చిత్రానికి ప్రముఖ దర్శకుడు మణిరత్నం రచన సహకారం అందించాడు. ఆరు నంది అవార్డులు అందుకోవడం విశేషం. బాక్సాఫీస్ వద్ద భారి వసూళ్ళు రాబట్టి సూపర్ హిట్‌గా నిలిచింది. శ్రీ సంగీతం అందించాడు.

gayam-2-created an unforgettable pain to kota srinivasa rao
gayam-2-created an unforgettable pain to kota srinivasa rao

కోట శ్రీనివాస రావు, తణికెళ్ళ భరణి, రామిరెడ్డి ఉత్తేజ్, చరణ్ రాజ్ లాంటి వాళ్ళు నటించారు. ఇక ఈ సినిమాకి కొనసాగింపుగా 2010లో గాయం 2వచ్చింది. ఈ సీక్వెల్ లో కూడా జగపతి బాబు హీరోగా నటించగా, విమలా రామన్ హీరోయిన్ గా నటించింది. రామ్ గోపాల్ వర్మ సమర్పించాడు. కర్తా క్రియేషన్స్‌పై డాక్టర్ సి. ధర్మకర్త నిర్మించాడు. ప్రవీణ్ శ్రీ దర్శకత్వం వహించాడు. మ్యూజిక్ మాస్ట్రో ఇళయరాజా సంగీతం అందించాడు. అయితే గాయం సినిమా రేంజ్ లో గాయం 2 హిట్ కాలేకపోయింది. కథా, స్క్రీన్ ప్లే బాగా వీక్ అనే టాక్ వినిపించింది. గాయం 2 అనగానే అందరూ వర్మ మార్క్ సినిమా అనుకున్నారు.

Gayam 2 : కోట శ్రీనివాస రావుకి గాయం 2 పెద్ద గాయాన్ని చేసింది.

కానీ ఇందులో తన శైలి స్క్రీన్ ప్లే కనిపించదు. కథ కూడా చాలా నెమ్మదిగా సాగుతుంది. ఇక ఇందులో కూడా కోట శ్రీనివాస రావు నటించగా ఆయన కొడుకు కోట ప్రసాద్ కూడా ఓ కీలక పాత్రలో నటించాడు. ఎప్పటి నుంచో కొడుకుని వెండితెర మీద చూసుకోవాలన్న తపన ఉండేది. అది ఈ సినిమాతో తీరింది. అయితే ఇందులో ఆయన చనిపోతాడు. మొదటి సినిమాలోనే చనిపోయే పాత్ర ఎందుకు అని దర్శక, నిర్మాతలతో కోట అన్నాడట. కథలో భాగంగా ఆ పాత్ర చనిపోతుంది. అయితే ఇదే నిజ జీవితంలో చివరి సినిమా అవుతుందని మాత్రం ఎవరూ ఊహించలేదు. సినిమా రిలీజ్ కి ముందే యాక్సిడెంట్‌లో కోట కొడుకు కోట ప్రసాద్ మృతి చెందాడు. ఆ రకంగా కోట శ్రీనివాస రావుకి గాయం 2 పెద్ద గాయాన్ని చేసింది.

Stay on top of the game with the latest updates on Telugu latest news today! Experience the thrill of LIVE Telugu news updates like never before, only on Teluguonlinenews.com.

Mail

Published on జూలై 18, 2021 at 9:10 ఉద.