Gayathri Bhargavi తెలుగు బుల్లితెరపై తమ గలగల మాటలతో ప్రేక్షకులను ఎంతగానో అలరించేటువంటి టాలీవుడ్ బ్యూటిఫుల్ యాంకర్లలో ఒకరైనటువంటి సీనియర్ యాంకర్ గాయత్రి భార్గవి గురించి శని ప్రేక్షకులకు కొత్తగా తెలియజేయాల్సిన అవసరం లేదు. అయితే యాంకర్ గాయత్రి భార్గవి కెరియర్ మొదలుపెట్టిన కొత్తలో పలు మ్యూజిక్ షోస్, అలాగే వంటల ప్రోగ్రామ్స్ వంటి వాటిలో యాంకరింగ్ నిర్వహిస్తూ బాగానే ఆకట్టుకుంది. ఆ తర్వాత క్రమక్రమంగా నటనపై మనసు మల్లడం, అలాగే సినిమా ఆఫర్లు కూడా రావడంతో పలు ప్రాధాన్యత ఉన్నటువంటి పాత్రలలో నటించి వెండితెర పై కూడా తన అభిమానులన్నీ బాగానే అలరించింది.
ఈ క్రమంలో ప్రముఖ స్టార్ హీరో రవితేజ హీరోగా నటించిన బలాదూర్ చిత్రంలో హీరో వదిన పాత్రలో నటించి తన సెంటిమెంటల్ ఓరియంటెడ్ నటనతో ప్రేక్షకులను కట్టిపడేసింది. దీంతో ఈ చిత్రం ద్వారా నటి గాయత్రి భార్గవికి మంచి గుర్తింపు లభించిందని చెప్పవచ్చు. ఆ తర్వాత యాంకర్ గాయత్రి భార్గవి పలు రకాల షోలు, ఈవెంట్లు అంటూ బిజీ బిజీగా గడుపుతున్నప్పటికీ సినిమాల్లో కూడా ప్రాధాన్యత ఉన్నటువంటి పాత్రలలో నటిస్తోంది.
అయితే నటి గాయత్రి భార్గవి ఈమధ్య సోషల్ మీడియా మాధ్యమాలలో కూడా బాగానే యాక్టివ్ గా ఉంటూ అప్పుడప్పుడు తనకు సంబంధించిన అందమైన ఫోటోలు, వీడియోలు వంటి షేర్ చేస్తూ ఇటు సోషల్ మీడియాలో కూడా తన అభిమానులను బాగానే అలరిస్తోంది. అయితే తాజాగా నటి గాయత్రి భార్గవి చక్కని సాంప్రదాయ దుస్తులు ధరించి చీరకట్టులో కనిపిస్తూ దిగినటువంటి ఫోటోలను తన అధికారిక ఇంస్టాగ్రామ్ ఖాతాలో షేర్ చేసింది. దీంతో ఒక్కసారిగా నెటిజెన్లు నటి గాయత్రి భార్గవి అందానికి ఫిదా అయ్యారు. అలాగే వయసు పెరుగుతున్నప్పటికీ నటి గాయత్రి భార్గవి అందం కూడా పెరుగుతోందని మరికొందరు కామెంట్లు చేస్తున్నారు.
ఈ విషయం ఇలా ఉండగా నటి గాయత్రి భార్గవి ఆ మధ్య భారతదేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఆంధ్రప్రదేశ్ కి వచ్చిన రోజున సభకి హోస్టుగా వ్యవహరించి విజయవంతం చేసింది. కాగా ప్రస్తుతం నటి గాయత్రి భార్గవి కుటుంబ బాధ్యతలు చక్కబట్టే పనిలో పడటంతో సినిమాలపై పెద్దగా దృష్టి సారించనట్లు తెలుస్తోంది కానీ సినిమా ఈవెంట్లు లేదా ఇంటర్వ్యూలు వంటి వాటితో మాత్రం తన అభిమానులకి ఎప్పుడూ కనిపిస్తూనే ఉంటుంది.