Gold Silver Rates: బంగారు ఆభరణాలను కొనాలనుకునే వారికి ఇది ఒక శుభవార్త. బంగారం, వెండి ధరలు గత నెల రోజుల నుంచి తగ్గుతూ వస్తున్నాయి. ఈ మధ్యకాలంలో బంగారం వెండి ఆభరణాలు కొనాలనుకునేవారికి ఇదొక సువర్ణ అవకాశం. ఆగస్టు 15 తేదీన 22 క్యారెట్ల బంగారం ధర 48,150 వద్ద ఉండేది. కానీ సెప్టెంబర్ 11 వ తేదీనాడు 22 క్యారెట్ల బంగారం ధర 46,750 వద్ద ఉంది. అంటే ఒక నెల రోజుల్లో 1400 రూపాయలు ధర తగ్గింది.
అలాగే 24 క్యారెట్ల బంగారం ధర ఆగస్టు 15వ తేదీ రూ.52,530 వద్ద ఉండేది. కానీ ఇప్పుడు 24 క్యారెట్ల బంగారం ధర 51000 వద్ద ఉంది. జీఎస్టీ చార్జీలు అదనం. వెండి ధర విషయానికి వస్తే ఈ మధ్యకాలంలో భారీగా తగ్గింది. ఆగస్టు 15 నాటి ధరల ప్రకారం వెండి ధర ఇప్పటివరకు 4400 రూపాయలు తగ్గింది. ఆగస్టు 15 నాటికి కేజీ వెండి ధర 64,800 వద్ద ఉంది. ఇప్పుడు 60,400 గా ఉంది.
రాబోయే రోజులలో అమెరికా డాలర్ బలహీన పడుతుందని అందువల్ల బంగారం ధరలు పెరిగే అవకాశం ఉందని మార్కెట్ వర్గాల అంచన వేశాయి. ప్రపంచ ముడి చమురు ధరలు 7 నెలల కనిష్టానికి వచ్చాయి. దీనివల్ల రాబోయే రోజులలో బంగారం ధరలు 60 వేలకు పైగా వెళ్లవచ్చని ట్రేడ్ వర్గాల అంచనా.
Gold Silver Rates:
గత వారం రోజులుగా చూస్తే వెండి రేటు 2000 రూపాయలు పెరిగింది. 58,500 రూపాయల నుంచి 60,500 రూపాయల వరకు వెండి రేటు పెరిగింది. అదేవిధంగా బంగారం ధర చూస్తే 24 క్యారెట్ల ధర 51,000 దగ్గర స్థిరంగా ఉంది.22 క్యారెట్ల బంగారం ధర 46,750 దగ్గర స్థిరంగా ఉంది. ఇలా గత వారంగా బంగారు , వెండి ధరలు స్థిరంగా ఉన్నాయి. ఇక కొనాలనుకునే వారికి ఇది శుభవార్త అనే చెప్పాలి.