IPL: 16వ సీజన్ ఐపీఎల్ లో జరిగిన మొదటి మ్యాచ్ లో చెన్నై సూపర్ కింగ్స్ మీద గుజరాత్ టైటాన్స్ ఐదు వికెట్ల తేడాతో విజయాన్ని సాధించారు. టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న గుజరాత్ ఎంచుకుంది. 20 ఓవర్లలో 7 వికెట్స్ నష్టానికి చెన్నై సూపర్ కింగ్స్ 178 పరుగులు చెయ్యగా, గుజరాత్ 19. 2 ఓవర్లలలో ఐదు వికెట్స్ కోల్పోయి, 182 పరుగులు చేసి, విజయం సాధించింది.
చెన్నై సూపర్ కింగ్స్ లో రుతురాజ్ గైక్వాడ్ చాల మంచి ఇన్నింగ్ ఆడినా కూడా చెన్నైలోని ఇంపాక్ట్ ప్లేయర్ ఇయన్ దేష్పాండే చెన్నై ఓటమికి కారణమైంది. అలాగే గుజరాత్ నుండి సుబ్ మాన్ గిల్ చాల మంచి ఇన్నింగ్ ఆడి, గుజరాత్ ను విజయం వైపు నడిపించాడు. సుబ్ మ్యాన్ గిల్ 36 బాల్స్ లలో 63 రన్ చేసి, గుజరాత్ ను హోమ్ టౌన్ లో విజయం వైపు నడిపించారు.

అలాగే చివర్లో రషీద్ ఖాన్ అండ్ రాహుల్ తేవాతియా కూడా చాల మంచి ఇన్నింగ్స్ ఆడారు. చెన్నై సూపర్ కింగ్స్ లో రుతురాజ్ 50 బాల్స్ లలో 92 రన్స్ చేసి, చెన్నై స్కోర్ బోర్డు ను పరుగులు పెట్టించారు కానీ చెన్నైలోని బౌలింగ్ లోపం వల్ల టీం ఓటమి పాలైంది. అయితే గుజరాత్ కు ఇది హోమ్ టౌన్ లో మొదటి మ్యాచ్ గెలిచి, అభిమానుల్లో ఉత్సాహాన్ని నింపారు.
చెన్నై బౌలర్స్ ఐన రాజవర్ధన్ మూడు వికెట్స్, రవీంద్ర జడేజా ఒక్క వికెట్స్ తీశారు. అలాగే గుజరాత్ బౌలర్లు అయిన షమీ 2 వికెట్స్, రషీద్ ఖాన్ 2 వికెట్స్, జోసెఫ్ 2 వికెట్స్, లిటిల్ 1 వికెట్ తీశారు.
స్కోర్
=====
చెన్నై సూపర్ కింగ్స్
చెన్నై 20 ఓవర్లలలో 7 వికెట్స్ నష్టానికి 178 పరుగులు చేసింది.
కాన్వాయ్ (6 బాల్స్ , 1 రన్), రుతురాజ్ గైక్వాడ్ (50 బాల్స్ , 92 రన్స్), మొయిన్ (17 బాల్స్ , 23 రన్), స్టోక్స్ (6 బాల్స్ , 7 రన్), రాయుడు (12 బాల్స్ , 12 రన్), కాన్వాయ్ (6 బాల్స్ , 1 రన్), శివమ్ దూబే(18 బాల్స్, 19 రన్స్), కాన్వాయ్ (2 బాల్స్ , 1 రన్), కాన్వాయ్ (7 బాల్స్ , 14 రన్), సట్నర్ (3 బాల్స్, 1 రన్)
గుజరాత్ టైటాన్స్
=============
గుజరాత్ టైటాన్స్ 19.2 ఓవర్లలలో 5 వికెట్స్ నష్టానికి 182 పరుగులు చేసి, విజయాన్ని సాధించింది.
వృద్ధిమాన్ సహా (16 బాల్స్ , 25 రన్), శుబ్ మన్ గిల్ (36 బాల్స్ , 63 రన్), సాయి సుదర్శన్(17 బాల్స్ , 22 రన్), హార్దిక్ పాండ్య (11 బాల్స్ , 8 రన్), విజయ్ శంకర్ (21 బాల్స్ , 27 రన్), రాహుల్ తేవాతియా (14 బాల్స్, 15 రన్స్), రషీద్ ఖాన్(3 బాల్స్, 10 రన్స్)