Guppedantha Manasu May 14 Episode: ఈరోజు ఎపిసోడ్ లో వసు రెస్టారెంట్ లో ఉండగా అక్కడికి రిషి ఒక పిల్లాడితో బొమ్మ పంపించిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత వసు ఆ బొమ్మని చూసి ఎంతో మురిసిపోతుంది. పైగా ఆ బొమ్మ తీసుకొచ్చిన ఆ పిల్లోడు అక్కడే ఉన్నాడని.. వెళ్లి ఆ బాబుకు ఎవరు ఇచ్చారో అని అడుగుతానని వెళుతుంది. దాంతో రిషి ఎక్కడ ఆ పిల్లాడు నిజం చెబుతాడో అని తెగ భయపడుతూ.. కంగారుపడుతూ కనిపిస్తాడు. దాంతో వెంటనే వసుకు ఆర్డర్ వచ్చిందని తిప్పలు పడి పంపిస్తాడు.
సీన్ కట్ చేస్తే..
జగతి గదిలో ఒంటరిగా ఉండగా అక్కడికి సాక్షి వస్తుంది. దారిలో వెళ్తున్నానని అందుకే రిషిని కలుద్దామని వచ్చాను అంటుంది. మాట్లాడుతూ ఉండగా తనను ఎవరు అర్థం చేసుకోరు అని.. కానీ నేను అందర్నీ అర్థం చేసుకుంటాను అని అంటుంది సాక్షి. దాంతో తిరిగి జగతి.. నిన్ను అర్థం చేసుకుంటలేరు అంటే అది నీ లోపం అని.. నువ్వు సరిగ్గా ఉండటం లేదు అని అంటుంది. ఆ మాటలకు సాక్షికి ఎదురు దెబ్బ తగిలినట్లు కనిపిస్తుంది.
ఇక రిషి కోసం ఈ సమయానికి రావడం కరెక్టు కాదు అని జగతి అంటుంది. ఎందుకంటే కాలేజ్ లో ఎన్నో టెన్షన్స్ పెట్టుకొని, బయట వ్యవహారాలు పట్టించుకొని రావడంతో కాస్త స్ట్రెస్ గా ఫీల్ అవుతాడని అంటుంది. మరి ఉదయం వచ్చినప్పుడు మాట్లాడకపోతే ఏం చేయాలి అని అడుగుతుంది సాక్షి. దాంతో జగతి నేరుగా రావడం మానేశాయ్ అంటూ తన స్టైల్లో అనటంతో.. వెంటనే సాక్షి నోటి నుండి మరో మాట బయటికి రాదు.
బొమ్మ గురించి ఆలోచనలో పడ్డ వసు..
మరోవైపు రిషి వసు గురించి ఆలోచిస్తూ ఉంటాడు. అప్పుడే అక్కడికి పూలు అమ్ముకునే ఆవిడ వస్తుంది. పువ్వులు తీసుకోమని అనటంతో మొదట రిషి వద్దు అని నిరాకరిస్తాడు. ఆ తర్వాత ఆమె అడగటంతోఆమె కోసమే తీసుకుంటాడు. ఇక అక్కడి నుంచి వసు.. బొమ్మ మనసుపెట్టి గీసారు అని ఆలోచిస్తూ వస్తుంది. ఇక ఈ బొమ్మ ఎవరు గీసారో అని అనుకుంటుంది. రెస్టారెంట్ లో రిషి ప్రవర్తించిన తీరును తలచుకొని రిషి గీసాడేమో అనుకోని దాని గురించి ఆలోచిస్తూ వస్తుంది.

Guppedantha Manasu May 14 Episode: రిషిని వెటకారం చేసిన వసు..
ఇక అక్కడే ఉన్న రిషి ఎదురు కావడంతో అక్కడ కూడా బొమ్మ గురించి ఆలోచిస్తూ ఉంటుంది. ఈ బొమ్మ ఇంత అందంగా ఎవరు గీశారు అని అంటుంది. ఈ బొమ్మ గీసిన వాళ్ళు ఎదురు పడితే ఏం చేస్తావు అనటంతో వెంటనే కౌగిలించుకొని థాంక్స్ చెబుతాను అని రిషిని కౌగిలించుకొని చూపిస్తుంది. ఒకవేళ నేనే గీసినట్లయితే ఏం చేస్తావు అనటంతో.. వెటకారంగా నవ్వుతూ మీరా అన్నట్లు మాట్లాడుతుంది వసు.