Guppedantha Manasu May 3 Episode: అల్లం టీ కి ఫిదా అయినా రిషి.. సాక్షితో మరో కుట్ర ప్లాన్ చేసిన దేవయాని!

Akashavani

Guppedantha Manasu May 3 Episode: ఈ రోజు ఎపిసోడ్ లో రిషి వసు దగ్గరికి వెళ్లి ఎక్కడికి వెళ్లావు కనీసం చెప్పకుండా వచ్చావు.. నాకు ఎంత బాధ అనిపించిందో తెలుసా అంటూ మనసులో మాటలను బయట పెడుతూ ఉంటాడు. ఇక వసు సమర్ధించుకునే మాటలు మాట్లాడి మీరు ఇక్కడికి ఎలా వచ్చారు అని అడుగుతుంది. ఇక ఆటో డ్రైవర్ ద్వారా కనుక్కున్నానని మరి మీ రూమ్ చూపించవా అని అడగటంతో వెంటనే వసు తన రూమ్ కు తీసుకెళ్తుంది.

సీన్ కట్ చేస్తే..

దేవయాని సాక్షి గురించి ఆలోచిస్తూ ఉంటుంది. సాక్షిని ఆయుధంగా మార్చుకొని జగతి, వసుల పనిచేయాలని అనుకుంటుంది. అప్పుడే సాక్షి ఫోన్ చేసి రిషి తనను పట్టించుకోకుండా ఉన్నాడు అని చెబుతుంది. దాంతో దేవయాని తనకు నచ్చజెప్పి.. నువ్వు ఇలా ఉంటే కరెక్ట్ కాదు అని తనకు ఒక విషయం చెబుతుంది. ఇక ఆ మాటలకు సాక్షి సరే అంటుంది.

వసుని తిట్టడానికి మనసు రాని రిషి..

ఇక రిషి వసు రూమ్ కి వెళ్లి వసు కష్టాల గురించి, తన మంచితనం గురించి వివరిస్తాడు. కానీ నాకు ఎందుకు చెప్పలేదు అనటంతో వసు ఆ విషయాన్ని వదిలేయండి సార్ అని తేలికగా చెప్పేస్తుంది. ఇక మనసులో రిషి.. అసలేం జరుగుతుంది నాకు.. వసును తిట్టడానికి వస్తే కనీసం ఒక్క మాట కూడా రావడం లేదు అని అనుకుంటాడు.

ఆ తర్వాత రిషి కోసం అల్లం టీ పెట్టుకొని వస్తుంది వసు. ఇక ఆ సమయంలో వారి మధ్య కాసేపు సరదాగా మాటల యుద్ధం జరుగుతుంది. రిషి మనసులో మాత్రం ఏదో చెప్పాలి అని కానీ అన్ని మర్చిపోయాను అని అనుకుంటాడు. నా మనసు అదుపు తప్పుతుంది అని బాగా ఫీల్ అవుతూ ఉంటాడు. కాసేపు మాట్లాడి అక్కడనుంచి వెళ్ళి పోతాడు.

ఉత్సాహంగా కనిపించిన రిషి..

మరోవైపు మహేంద్ర వర్మ, జగతి రిషి గురించి ఆలోచిస్తూ ఉంటారు. ఇక మహేంద్ర రిషి గురించి మాట్లాడటంతో జగతి మాత్రం రిషి ఎక్కడికి వెళ్ళాడో అని అంటుంది. సాక్షి వల్ల రిషి డిస్టర్బ్ అయ్యాడు అని అంటుంది. ఇక అలా రిషి గురించి మాట్లాడుతూ ఉండగా రిషి వస్తాడు. ఇక డిస్టర్బ్ గా వస్తాడనుకున్న రిషి ఉత్సాహంగా వస్తాడు.

అల్లం టీకి ఫిదా అయినా రిషి..

అప్పుడే ధరణి వచ్చి కాఫీ, టీ కావాలా అని అడగటంతో ఇప్పుడే అదిరిపోయే అల్లం టీ తాగి వచ్చాను అని ఆ టీ గురించి పొగుడుతూ అద్భుతంగా చెబుతాడు. రిషిని చూసి మహేంద్ర ఆశ్చర్యపోతూ కనిపిస్తాడు. జగతి వసుకి ఫోన్ చేసి జాగ్రత్తలు అడుగుతుంది. పైగా రిషి అక్కడికి వచ్చాడు అని తెలియటంతో జగతి వాళ్ళు సంతోషపడుతారు.

Guppedantha Manasu May 3 Episode: అల్లం టీ కి ఫిదా అయినా రిషి.. సాక్షితో మరో కుట్ర ప్లాన్ చేసిన దేవయాని!
Guppedantha Manasu May 3 Episode: అల్లం టీ కి ఫిదా అయినా రిషి.. సాక్షితో మరో కుట్ర ప్లాన్ చేసిన దేవయాని!

Guppedantha Manasu May 3 Episode:  వసు ను మిస్ అవుతున్న గౌతమ్..

ఇక గౌతమ్ వసు ఫోటో చూస్తూ వసు ను తలచుకుంటూ ఉండగా అప్పుడే అక్కడికి రిషి వచ్చి కాసేపు క్లాస్ పీకుతాడు. ఇక తను వసును మిస్ అవుతున్నాను అనటంతో రిషి కోపంతో రగిలిపోతాడు. తరువాయి భాగంలో వసు రిషి కి ఓ విషయం చెప్పడానికి సిద్ధమవుతోంది.

- Advertisement -