Guppedantha Manasu May 5 Episode: ఇంటికి రావద్దని రిషిని అవమానించిన వసు.. తట్టుకోలేకపోతున్న రిషి!

Akashavani

Guppedantha Manasu May 5 Episode: ఈరోజు ఎపిసోడ్ లో.. వసు రిషిని తన ఇంటికి పిలిచి భోజనం పెట్టిన సంగతి తెలిసిందే. ఇక భోజనం చేస్తూ ఇద్దరు వంటల గురించి, అన్నం గురించి మాట్లాడుతూ ఉంటారు. అప్పుడే భూలక్ష్మి.. వసు, రిషి లను చూసి వారి మధ్య ఏమి నడుస్తుంది అన్నట్లుగా అనుకుంటుంది. రిషి బయలుదేరుతూ ఉండగా బయట వసు తో కాసేపు మాట్లాడుతాడు. ఇక అక్కడే ఉన్న భూలక్ష్మి, సుబ్బయ్య వాళ్లను చూసి ఏవేవో మాట్లాడుకుంటారు.

వసును అనుమానించిన ఇరుగుపొరుగువారు..

రిషి వెళ్లిపోయాక ఎవరు అతను.. సర్ అయితే కాలేజీలో చూసుకోవాలి కాని.. ఇంటి వరకు తీసుకొచ్చి భోజనాలు పెట్టడం ఏంటి అని ఘోరంగా అవమానిస్తారు. వసు వారికి ఎంత నచ్చజెప్పే ప్రయత్నం చేసినా వాళ్ళు వినిపించుకోకుండా అక్కడ్నుంచి వెళ్ళిపోతారు. ఆ తర్వాత భూలక్ష్మి దేవయానికి ఫోన్ చేసి వాళ్ళిద్దర్నీ దూరం చేసే ప్రయత్నం చేశాను అని అంటుంది. ఆ మాటలకు దేవయాని సంతోష పడుతూ ఉండగా ధరణి వచ్చి ఈ సంతోషాన్ని చూస్తే ఎవరినో కుట్ర చేసింది అని అనుకుంటుంది.

జగతిని బాధపెట్టిన రిషి..

ఆ తర్వాత ఉదయాన్నే రిషి, గౌతమ్, మహేంద్ర వర్మ వర్కౌట్లు చేస్తూ ఉండగా.. అక్కడ గౌతమ్ సాక్షి గురించి అడుగుతాడు. ఇక రిషి ఆ ప్రశ్నను అక్కడికే కట్ చేస్తాడు. అదే సమయంలో సాక్షి ఫోన్ చేసి టిఫిన్ చేద్దాం అని అంటుంది. దాంతో రిషి తన ఫ్రెండ్ తో చేయాలి అనుకుంటున్నాను అని చెప్పి కట్ చేస్తాడు. పక్కన ఉన్న గౌతమ్ రిషి తన గురించే అన్నాడు అని తెగ పొంగిపోతాడు. అప్పుడే జగతి జ్యూస్ తీసుకుని రావడంతో రిషి జ్యూస్ తీసుకోకుండా జగతిని బాధపెడతాడు.

Guppedantha Manasu May 5 Episode: ఇంటికి రావద్దని రిషిని అవమానించిన వసు.. తట్టుకోలేకపోతున్న రిషి!
Guppedantha Manasu May 5 Episode: ఇంటికి రావద్దని రిషిని అవమానించిన వసు.. తట్టుకోలేకపోతున్న రిషి!

Guppedantha Manasu May 5 Episode:  తప్పు తెలుసుకున్న వసు..

మరోవైపు వసుధార తన ఇంట్లో చదువుతూ ఉండగా.. తనకు పదే పదే మార్కెటింగ్ కాల్స్ వస్తుంటాయి. అదే సమయంలో రిషి అక్కడికి వచ్చి తనకు ఫోన్ చేయగా అది కూడా మార్కెటింగ్ కాల్ అనుకొని పదే పదే ఎందుకు ఫోన్ చేసి విసిగిస్తున్నారు అని అంటుంది. అప్పుడే రిషి మాట్లాడటం తో వసు తప్పు తెలుసుకొని సారీ చెబుతుంది. ఇక రిషి బయట ఉన్నాను వచ్చేసేయ్ అనడంతో.. రిషి తన కారులో ఎక్కించుకొని తీసుకుని వెళ్తాడు.

రిషిని దూరం పెట్టిన వసు..

ఇక అది భూలక్ష్మి తో పాటు సుబ్బయ్య కూడా చూస్తాడు. ఇక వారు కారులో వెళ్తూ కాసేపు మాట్లాడుకుంటూ ఉంటారు. జగతి, మహేంద్ర వర్మలు కూడా వసు ఇంటికి వచ్చి అక్కడున్న వాతావరణాన్ని చూసి సంతోషంగా ఫీల్ అవుతారు. తరువాయి భాగం లో రిషి వసు ఇంటికి రావడంతో.. వసు రావద్దు సార్ అని బ్రతిమాలుతూ ఉంటుంది. అయినా కూడా రిషి ఇంట్లోకి వెళ్లడానికి ప్రయత్నించగా వెంటనే తలుపులు వేసేసి రిషిని అవమాన పరుస్తుంది. ఇక వసు అలా చేయటంతో రిషి బాధపడతాడు.

- Advertisement -