Hanu Raghavapudi: రష్మిక హీరోయిన్ కాదు..దర్శకుడి కామెంట్స్ వైరల్..

G K

Hanu Raghavapudi: రష్మిక హీరోయిన్ కాదు అంటూ.. తాజాగా దర్శకుడు హను రాఘవపూడి చేసిన కామెంట్స్ ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఇంతకీ హను రాఘవపూడి ఏ సినిమా చేస్తున్నాడు..అందులో రష్మిక మందన్నా హీరోయిన్‌గా నటిస్తుందా..అనే సందేహాలు చాలామందిలో కగవచ్చు. ఎందుకంటే వీరి కాంబినేషన్‌లో రూపొందుతున్న సినిమాకు సంబంధించి ఎలాంటి వరుస అప్‌డేట్స్ లేవు కాబట్టి. ఈ దర్శకుడు ఇప్పటి వరకు తీసింది 4 సినిమాలు మాత్రమే. వాటిలో రెండు సూపర్ హిట్..రెండు అట్టర్ ఫ్లాప్.

అందాల రాక్షసి సినిమాతో దర్శకుడిగా మారిన హను రాఘవపూడి మొదటి సినిమాతో దర్శకుడిగా మంచి ప్రశంసలు అందుకున్నాడు. ఆ తర్వాత నేచురల్ స్టార్ నాని, మెహ్రీన్ జంటగా కృష్ణగాడి వీరప్రేమ గాథ చిత్రాన్ని తీసి భారీ హిట్ అందుకున్నాడు. ఈ రెండు సినిమాలు ఆయనకు మంచి పేరు తీసుకువస్తే ఆ తర్వాత నితిన్‌తో చేసిన లై, శర్వానంద్ – సాయి పల్లవిలతో చేసిన పడి పడి లేచె మనసు సినిమాలు ఫ్లాప్‌గా మిగిలి నెగిటివ్ కామెంట్స్ ఎదుర్కొన్నాడు. ఆ తర్వాత కొంత గ్యాప్ తీసుకున్న హను రాఘవపూడి విభిన్నమైన కథాశంతో ‘సీతారామం’ అనే సినిమాను తెరకెక్కిస్తున్నాడు.

Hanu Raghavapudi: ఇప్పటి వరకు చేయని ఓ రెబల్ పాత్రలో..?

ఇటీవల రష్మిక మందన్న బర్త్ డే సందర్భంగా ఈ సినిమాలో నటిస్తున్నట్టు ప్రకటించి సర్‌ప్రైజ్ ఇచ్చారు. మలయాళ యంగ్ హీరో దుల్కర్ సల్మాన్ ఇందులో కీలక పాత్రలను పోషిస్తుండా..’మహానటి’ సినిమాను నిర్మించిన స్వప్న సినిమా పతాకంపై నిర్మిస్తున్నారు. అయితే, ఇటీవల ఓ ఇంటర్వ్యూలో హను రాఘవపూడి మాట్లాడుతూ.. రష్మిక పాత్ర గురించి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు. రష్మిక పాత్ర ‘సీతారామం’ సినిమాలో ఎంతో ఎమోషనల్‌గా సాగుతుందని.. తాను ఇందులో అఫ్రీన్ అనే కాశ్మీర్ ముస్లీం అమ్మాయిగా కనిపించబోతుందని తెలిపాడు. ఈ సినిమాలో హీరోయిన్‌లా కాకుండా ఓ హీరో మాదిరిగా నటిస్తున్నట్టు చెప్పుకొచ్చాడు. దీన్నిబట్టి రష్మిక ‘సీతారామం’లో ఇప్పటి వరకు చేయని ఓ రెబల్ పాత్రలో కనిపించనుందని క్లారిటీ వచ్చింది.

- Advertisement -