Harnaaz Sandhu: మిస్ యూనివర్స్ ను కించపరిచిన శిల్పా శెట్టి, బాద్ షా.. ఫైర్ అవుతున్న నెటిజన్లు

Akashavani

Harnaaz Sandhu: సినీ ప్రియులకు శిల్పా శెట్టి గురించి పెద్దగా పరిచయం అక్కర్లేదు. దాదాపు 40 సినిమాలకు పైగా నటించి నటనతో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. ఇక తన అందం గురించి మనకు తెలుసు. హిందీ లో ఆగ్ అనే చిత్రంలో నటించి బీ టౌన్ ప్రేక్షకుల ను మరో లెవెల్లో ఆకట్టుకొని ప్రేక్షకుల విమర్శకుల ప్రశంసలు అందుకుంది.

మొత్తానికి శిల్పా శెట్టి బీ టౌన్ ప్రేక్షకులతో మంచి ర్యాపో పెంచుకొని ప్రస్తుతం బాలీవుడ్లో ఓ వెలుగు వెలుగుతుంది. ఇక ఇదంతా పక్కన పెడితే హర్నాజ్‌ కౌర్ సంధు అనే మిస్ యూనివర్స్ మనకు తెలుసు ఈమె టైటిల్ ను భారత దేశం గర్వపడేలా దక్కించుకుంది. ఇంకా టైటిల్ సొంతం చేసుకున్న అప్పటి నుంచి హార్నాజ్ అనేక ఈవెంట్ లలో పలు ఇంటర్వ్యూలలో పాల్గొంటుంది.

ఇక అదే క్రమంలో తాజాగా మోస్ట్ పాపులర్ అయినటువంటి ఇండియాస్ గాట్‌ టాలెంట్ 9కు చీఫ్ గెస్ట్ గా అటెండ్ అయింది. ఇక ఈ రియాలిటీ షోకు బాద్‌షా, శిల్పా శెట్టి, మనోజ్ ముంతా షీర్, కిరణ్ ఖేర్ జడ్జీలుగా వ్యవహరిస్తున్నారు. ఇక ఈ షో మిస్ యూనివర్స్ హర్నాజ్‌ కౌర్ హాజరైన అనేక వీడియోలు సోషల్ మీడియా లో చక్కర్లు కొడుతున్నాయి.

Harnaaz Sandhu: మిస్ యూనివర్స్ ను కించపరిచిన శిల్పా శెట్టి, బాద్ షా.. ఫైర్ అవుతున్న నెటిజన్లు
Harnaaz Sandhu: మిస్ యూనివర్స్ ను కించపరిచిన శిల్పా శెట్టి, బాద్ షా.. ఫైర్ అవుతున్న నెటిజన్లు

Harnaaz Sandhu: మిస్ యూనివర్స్ ను శిల్పా శెట్టి కించపరచినందుకు నెటిజన్లు ఈ విధంగా దుమ్మెత్తిపోశారు.

ఆ వీడియో లలో హార్నాజ్ కౌర్ న్యాయ నిర్నెత లను పలకరించడానికి వచ్చినప్పుడు శిల్పా శెట్టి ఏ మాత్రం తన ని పట్టించుకోకుండా వెళ్ళిపోయింది. ఇక ఆ వీడియోలో శిల్పా శెట్టి, బాద్ షా ప్రవర్తన చుసిన నెటిజన్లు కామెంట్ల రూపంలో విరుచుకుపడుతున్నారు. మరికొందరు మాత్రం ఆమె మీ దగ్గరకు వచ్చి షేక్హ్యాండ్ ఇస్తూ ఉంటే మీరు ఇచ్చే గౌరవం ఇదేనా అని దుమ్మెత్తిపోస్తున్నారు. ఇక మీరు కూడా ఆ వీడియో పై ఒక లుక్కేయండి.

- Advertisement -