Hema : అలా చేస్తున్నారంటూ పోలీస్ స్టేషన్ కి వెళ్ళిన నటి హేమ.. డ్రగ్స్ వ్యవహారమేనా…?

Joythi R

Hema : ఈ మధ్యకాలంలో కొందరు ఆకతాయిలు మరియు యూట్యూబ్ ఛానల్స్ వ్యూస్ కోసం మరియు పాపులర్ కావడం కోసం సినీ సెలబ్రిటీల గురించి తప్పుడు కథనాలను ప్రచారం చేస్తున్నారు. దీంతో సినీ సెలబ్రిటీలు ఈ విషయం కారణంగా చిక్కుల్లో పడుతున్నారు. అయితే టాలీవుడ్ లో క్యారెక్టర్ ఆర్టిస్టు పాత్రల్లో నటించి ప్రేక్షకులను ఎంతగానో అలరించిన తెలుగు ప్రముఖ క్యారెక్టర్ ఆర్టిస్ట్ హేమ గురించి కొందరు సోషల్ మీడియా మాధ్యమాలలో తప్పుడు కథనాలు ప్రచారం చేయడంతో పోలీస్ స్టేషన్ కి వెళ్లి ఫిర్యాదు చేసింది.

పూర్తి వివరాల్లోకి వెళితే రెండు రోజుల క్రితం హైదరాబాద్ నగర పరిసర ప్రాంతంలో ఉన్నటువంటి ఓ ప్రముఖ పబ్ పై పోలీసులు ఆకస్మిక తనిఖీలు నిర్వహించిన సంగతి అందరికి తెలిసిందే అయితే ఈ తనిఖీల్లో టాలీవుడ్ సినిమా పరిశ్రమకు చెందిన సినీ ప్రముఖుల పిల్లలు మరియు ప్రముఖ రాజకీయ నాయకుల పిల్లలు వంటి వాళ్లు పోలీసులకు చిక్కారు. అయితే ఇలా పోలీసులకు చిక్కిన వారిలో నటి హేమ కూడా ఉందంటూ కొందరు యూట్యూబ్ ఛానల్ న్యూస్ కోసం తప్పుడు కథనాలు మరియు వీడియోలు చేస్తూ నటి హేమ గురించి తప్పుగా ప్రచారం చేస్తున్నారు.

దీంతో నటి హేమ ఈ విషయం గురించి పోలీసులకు ఫిర్యాదు చేసింది అలాగే సంబంధం లేనటువంటి కేసులో తనని ఇరికిస్తూ కొందరు చేస్తున్నటువంటి ఈ పనుల వల్ల తనకు ఇబ్బందులు ఎదురవుతున్నాయని పేర్కొంది. అలాగే తన గురించి తప్పుడు ప్రచారాలు చేస్తున్న వారిని కఠినంగా శిక్షించాలని పోలీసులను కోరింది. అలాగే తనకి పబ్బులకు వెళ్ళే అలవాటు లేదని కూడా స్పష్టం చేసింది.

అయితే ఈ విషయం ఇలా ఉండగా పోలీసులు ఆకస్మిక తనిఖీల్లో చిక్కిన వారిలో టాలీవుడ్ ప్రముఖ నటుడు మరియు సినీ నిర్మాత నాగబాబు కూతురు నిహారిక కొణిదెల మరియు ప్రముఖ సింగర్ రాహుల్ సిప్లిగంజ్ కూడా ఉన్నట్లు పోలీసులు పేర్కొన్నారు. కాగా ఇందులో నిహారిక కొణిదల తప్పు లేక పోవడంతో ఆమె కి కౌన్సిలింగ్ ఇచ్చి ఇంటికి పంపించారు. కానీ సింగర్ రాహుల్ సిప్లిగంజ్ మాత్రం ఇంకా పోలీసులు కస్టడీలోనే ఉన్నట్లు తెలుస్తోంది. అయితే హైదరాబాద్ నగరంలో రోజురోజుకి పప్పు కలిశారు మీరు తొందరగా ఇప్పటికే కొందరు నగర వాసులు చెబుతున్నారు.

అంతేకాకుండా అర్ధరాత్రి వరకు మద్యం అమ్మకాలు చేస్తుండటంతో కొందరు ఆకతాయిలు రోడ్ల మీద కూడా అప్పుడప్పుడు వీరంగం సృష్టిస్తున్నారని కాబట్టి మద్యం అమ్మకాలు మరియు డ్రగ్స్ సరఫరా చేస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.

- Advertisement -