Raja : హీరో రాజా అడ్రస్ లేకుండా పోవడానికి కారణం చాలాపెద్దది..!

G K

Raja : టాలీవుడ్ లో ఎలాంటి సపోర్ట్ లేకుండా ఆనంద్ లాంటి సినిమాలో అవకాశం అందుకొని అద్భుతమైన హిట్ అందుకున్న యంగ్ హీరో రాజా. ఆనంద్ సినిమా తర్వాత ఆయనకి ఎన్నో మంచి అవకాశాలు వచ్చాయి. శేఖర్ కమ్ముల దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా ఊహించని సక్సెస్ అందుకుంది. అలాగే వెన్నెల సినిమా రాజా కెరీర్ లో మరో సూపర్ హిట్ మూవీ. ఒకవైపు హీరోగా సినిమాలు చేస్తూనే మరొకవైపు మంచి రోల్స్ వస్తే క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గానూ చేశాడు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ – ధరణి కాంబినేషన్‌లో వచ్చిన బంగారం సినిమాలో నటించాడు.

hero-raja is much -intrested-in-spirtuality-than-movies
hero-raja is much -intrested-in-spirtuality-than-movies

అలాగే సూపర్ స్టార్ మహేష్ బాబు – శ్రీయ – గుణశేఖర్ కాంబినేషన్‌లో వచ్చిన సెన్షేషనల్ మూవీ అర్జున్‌లోనూ చాలా మంచి రోల్ చేశాడు. ఇదే క్రమంలో ఆ నలుగురు, ఒక ఊరిలో, స్టైల్ లాంటి మంచి సినిమాలు రాజా కెరీర్‌లో ఉన్నాయి. అయితే ఒక్కసారిగా ఆయన ఫేడౌట్ అయ్యాడు. అందుకు కారణాలు బలంగా అంటూ ఏవీ బయటకు రాలేదు. అయితే రాజా చేసిన సినిమాలన్నీ వరుసగా ఫ్లాపవుతూ వచ్చాయి. దాంతో అవకాశాలు రాలేదని ..డిప్రషన్‌లోకి వెళ్ళి ఆ తర్వాత సినిమాల మీద ఇండస్ట్రీ మీద విరక్తి వచ్చి దూరంగా ఉన్నాడని ప్రచారం జరిగింది.

Raja : రాజా కి సంబంధించి ఇంతకాలం వచ్చినవన్నీ అవాస్తవాలే.

2010 తర్వాత అసలు రాజా సినిమా ఇండస్ట్రీలో ఎక్కడా కనిపించలేదు…ఆయన మాట వినిపించలేదు. మధ్యలో ఓసారి సూసైడ్ చేసుకోబోయాడని వార్తలు వచ్చాయి. అయితే రాజా ఎక్కడికీ వెళ్ళలేదు. హైదరాబాద్ లోనే ఉన్నాడు. కాకపోతే సినిమాలకి దూరంగా ఉంటూ సమాజ సేవ చేస్తున్నాడు. సోషల్ గా మూవ్ అవుతున్నాడు. క్రిస్టియానిటీలోకి మారిన రాజా ఎక్కువగా స్పిరిచువల్ వేలో సాగుతున్నాడు. ఇతర వ్యాపారాలు ఏవో చేస్తూ ప్రజలకి సేవ చేసే పనుల్లో ఉన్నాడు. అంతేగానీ సినిమా ఇండస్ట్రీని వదిలి ఏ దేశానికో వెళ్ళిపోలేదు. రాజా కి సంబంధించి ఇంతకాలం వచ్చినవన్నీ అవాస్తవాలే.

- Advertisement -