Nithya Menen: తెలుగు సినీ ప్రేక్షకులకు టాలీవుడ్ హీరోయిన్ నిత్యామీనన్ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. నిత్యా మీనన్ నటించినది తక్కువ సినిమాలే అయినప్పటికీ ప్రత్యేకమైన గుర్తింపును ఏర్పరచుకుంది. మొదట అలా మొదలైంది సినిమాతో తెలుగు సినిమా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన ఈ ముద్దుగుమ్మ అది తక్కువ సమయంలోనే భారీగా బాపులారిటీని సంపాదించుకుంది. సినిమాలలో వైవిధ్యమైన పాత్రలలో నటిస్తూ అభిమానులను ఒప్పిస్తూ ఉంటుంది.
అంతేకాకుండా ఇప్పటివరకు నిత్యామీనన్ ఎక్కువగా నటనకు ప్రాధాన్యం ఉన్న పాత్రలను చేస్తూ వచ్చింది. తెలుగులో గుండెజారి గల్లంతయ్యిందే, ఇష్క్, గీతా గోవిందం, సన్నాఫ్ సత్యమూర్తి, భీమ్లా నాయక్ లాంటి సినిమాల్లో నటించి మెప్పించింది. ఇక చివరిగా భీమ్లా నాయక్ సినిమాతో తెలుగు ప్రేక్షకులను పలకరించిన విషయం తెలిసిందే. ఇది ఇలా ఉంటే తాజాగా నిత్యామీనన్ కి సంబంధించిన ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ప్రస్తుతం నిత్యామీనన్ తమిళం మలయాళం లో సినిమాలు చేస్తూ బిజీ బిజీగా ఉంది. ఇక ఈ సినిమా షూటింగ్లో భాగంగానే తాజాగా ఆంధ్ర ప్రదేశ్ లోని కృష్ణాపురం వెళ్ళింది నిత్యామీనన్. ఇక అక్కడే ఉన్న ఒక గవర్నమెంట్ స్కూల్ లోకి వెళ్ళింది.
View this post on Instagram
అక్కడ క్లాస్ రూమ్ లోకి వెళ్లి విద్యార్థులకు తెలుగు పాఠాలు చెప్పింది. అందుకు సంబంధించిన వీడియోని తన ఇంస్టాగ్రామ్ ఖాతాలో పంచుకుంది. ఆ వీడియోలో ఆమె తెలుగులో మాట్లాడుతుంటే నిత్యామీనన్ మలయాళీ అమ్మాయి కాదు పక్కా తెలుగు అమ్మాయి అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఇక ఆ వీడియో చూస్తుంటే నిజంగానే నిత్యామీనన్ టీచర్ అన్న విధంగా కనిపిస్తోంది.