Hotel Business : ఫుడ్ బిజినెస్ స్టార్ట్ చేసిన తెలుగు నటి…. అప్పుడే అవార్డ్ కూడా అందుకుంది గా…

Joythi R

Hotel Business : తెలుగులో పలు చిత్రాలలో అమ్మ అక్క చెల్లి వదిన తదితర క్యారెక్టర్ ఆర్టిస్ట్ పాత్రలో నటించి ప్రేక్షకులను బాగానే ఆకట్టుకున్నటువంటి తెలుగు బ్యూటిఫుల్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ సత్య కృష్ణన్ గురించి తెలియనివారుండరు. అయితే నటి సత్య కృష్ణన్ 1, 2 చిత్రాలలో హీరోయిన్ గా కూడా నటించింది. ఇందులో సత్య కృష్ణన్ హీరోయిన్ గా నటించిన మెంటల్ కృష్ణ చిత్రం ప్రేక్షకుల్ని ఓ మోస్తరుగా బాగానే ఆకట్టుకుంది. కానీ నటి సత్య కృష్ణన్ కి మాత్రం ఆఫర్లను తెచ్చి పెట్టలేకపోయింది. అయితే ఈ మధ్య కాలంలో సినిమాల్లో నటించడం బాగా తగ్గించేసింది అలాగే అంతకు మునుపటి లాగా సినిమా ఇండస్ట్రీలో యాక్టివ్ గా ఉండటం లేదు.

అయితే ఇటీవలే నటి సత్యకృష్ణన్ ఫుడ్ కి సంబంధించిన హోటల్ బిజినెస్ లోకి ఎంటర్ అయినట్లు తెలుస్తోంది. కాగా తాజాగా నటి సత్య కృష్ణన్ హైదరాబాదులోని గండిపేట పరిసర ప్రాంతంలో లిక్విడ్స్ అనే హెల్తీ జ్యూస్ మరియు ఫుడ్ రెస్టారెంట్ ని స్టార్ట్ చేసింది. కాగా ఈ హోటల్ కి అప్పుడే బెస్ట్ అవార్డు విన్నింగ్ హోటల్ గా అవార్డు కూడా వచ్చినట్లు సమాచారం. అయితే ఈ హోటల్ లో మాంసాహారం, శాకాహారం మరియు పళ్ళ రసాలు వంటివి కూడా దొరుకుతాయి. దీంతో నటి సత్య కృష్ణన్ ఈ మధ్యకాలంలో ఈ హోటల్ నిర్వహణపై ఎక్కువగా దృష్టి సారించినట్లు తెలుస్తోంది. అందుకే సినిమాల్లో పెద్దగా నటించడం లేదు.

కాగా ప్రస్తుతం నటి సత్య కృష్ణన్ కి దాదాపుగా 40 సంవత్సరాల వయసు పైబడినప్పటికీ పెళ్లి మాత్రం చేసుకోలేదు. కానీ ఆ మధ్య ఈ విషయం తెలియనటువంటి కొందరు వ్యక్తులు ఏకంగా తెలుగు ప్రముఖ క్యారెక్టర్ ఆర్టిస్ట్ మరియు డైలాగ్ రైటర్ హర్ష తో సత్యకృష్ణన్ కి పెళ్లి అయిపోయిందని తప్పుడు కథనాలు ప్రచారం చేశారు. కానీ నటి సత్య కృష్ణన్ మాత్రం ఈ విషయంపై స్పందించ లేదు సరికదా కనీసం పట్టించుకోలేదు. కాగా నటి సత్య కృష్ణన్ తెలుగు భాషలో దాదాపుగా 80కి పైగా చిత్రాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ పాత్రలలో నటించి బాగానే అలరించింది. అయితే ఇటీవలే నటి సత్యకృష్ణన్ తెలుగులో ప్రముఖ హీరో శర్వానంద్ హీరోగా నటించిన ఆడవాళ్లు మీకు జోహార్లు అనే చిత్రంలో ఓ ప్రాధాన్యత ఉన్నటువంటి పాత్రలో కనిపించింది.

- Advertisement -