Hyundai Sonata 2023 : హ్యుందాయ్ కార్లకు భారత్ లో ఉన్న డిమాండ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. హ్యుందాయ్ లో చాలా మోడల్ కార్లు భారత్ లో హిట్ అయ్యాయి. తాజాగా హ్యుందాయ్ నుంచి సొనాటా వర్షెన్ లో 2023 మోడల్ కారు సరికొత్త డిజైన్ తో లాంచ్ అయింది. ఇప్పటికే ఉన్న డిజైన్ లో పలు మార్పులు చేసి సొనాటా 2023 వెర్షన్ ను తీసుకొచ్చింది. ఎక్స్ టీరియర్, ఇంటీరియర్ లో చాలా మార్పులు చేసింది కంపెనీ.
ఈ వెర్షన్ కారును గ్లోబల్ మార్కెట్ కోసం హ్యుందాయ్ తీసుకొచ్చింది. దీనికి సొనాటా 2023 వెర్షన్ గా పేరు పెట్టింది. నిజానికి.. సొనాటా మోడల్ కారును చాలా ఏళ్ల నుంచి ఇండియా మార్కెట్ లోకి కంపెనీ తీసుకురాలేదు. దానికి కారణం.. సొనాటా కార్ల సేల్స్ భారత్ లో తగ్గడం. మరి.. ఈ సరికొత్త వర్షన్ కారును భారత్ లో హ్యుందాయ్ లాంచ్ చేస్తుందా? లేదా? అనేది ఇంకా తెలియదు.
Hyundai Sonata 2023 : వెర్నా లుక్ తో వచ్చిన సొనాటా
ఇటీవల హ్యుందాయ్ నుంచి వెర్నా 2023 వర్షన్ కారు విడుదలైంది. ఇది భారత్ లోనూ అందుబాటులో ఉంది. 2023 వెర్నా మోడల్ లోనే సొనాటా డిజైన్ కూడా ఉంటుంది. సొనాటా 2023 వర్షన్ కారు ఇంటీరియర్ లో చాలా చేంజెస్ ఉన్నాయి. మోడర్న్ లుక్ తో పలు అత్యాధునిక ఫీచర్లను ఈ కారులో యాడ్ చేశారు.
12.3 ఇంచ్ డిస్ ప్లేలు, క్లైమేట్ కంట్రోల్, టచ్ కంట్రోల్స్, డ్రైవర్ ఫోకస్‌డ్ డాష్ బోర్డ్, ఇంటీరియర్ చేంజెస్ లాంటీ ఫీచర్లు ఉన్నాయి. పెట్రోల్ ఇంజిన్, ప్లగిన్ పవర్ రైన్, సింగిల్ పీస్ ఏసీ వెంట్స్, స్పోర్టీ లుక్, ఎన్ లైన్ వేరియంట్స్ ఈ కారు సొంతం.
ఫుల్ విడ్త్ ఎల్‌ఈడీ లైట్ బార్స్, స్పోర్ట్స్ బంపర్, సరికొత్త లుక్ తో అలాయ్ వీల్స్, లైట్ బార్ హెచ్ ప్యాటర్న్ లాంటి ఫీచర్లతో ఈ కారు ప్రస్తుతం ప్రపంచ మార్కెట్ లో విడుదలైంది. ఈ కారు అత్యాధునిక ఫీచర్లతో రావడంతో చాలామంది హ్యుందాయ్ లవర్స్ ఈ కారు వైపు మొగ్గు చూపుతున్నారు.