Pooja hegde : ఆచార్య సినిమా భారీ స్థాయిలో నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. మెగాస్టార్ చిరంజీవి – కాజల్ అగర్వాల్ జంటగా నటిస్తున్నారు. కాజల్ రెండవ సారి ఆచార్యలో మెగాస్టార్ కి జంటగా నటిస్తున్నారు. ఇక ఇందులో మరో హీరోగా చిరు తనయుడు మెగా పవర్ స్టార్ రాం చరణ్ నటిస్తున్నాడు. కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్నాడు. దాదాపు సినిమా షూటింగ్ పూర్తయింది. చరణ్, పూజా హెగ్డేల మీద సాంగ్ అలాగే కొన్ని సీన్స్ బ్యాలెన్స్ ఉన్నాయి. త్వరలో ఈ సినిమా షూటింగ్ తో పాటు ప్రమోషన్స్ కూడా మొదలుపెట్టబోతున్నారు.

ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలయిన ప్రచార చిత్రాలు, లాహే లాహే సాంగ్ ఆచార్య మీద భారీ అంచనాలు పెంచేశాయి. మే 13న భారీ స్థాయిలో రిలీజ్ కావాల్సిన సినిమా కరోనా సెకండ్ వేవ్ వల్ల ఆగిపోయింది. అయితే విజయదశమి పండుగ సందర్భంగా అక్టోబర్ లో రిలీజ్ చేసే సన్నాహాలు చేస్తున్నారు. అయితే ఈ సినిమాలో చరణ్ కి జంటగా పూజా హెగ్డే నటిస్తుండగా చరణ్ పట్టుపట్టి ఆమెనే కావాలని దర్శకుడికి సూచించాడట. రష్మిక మందన్న నటిస్తుందని అనుకున్నారు. ఆమెనే ఫైనల్ చేసి కూడా మళ్ళీ చరణ్ మాట కోసం పూజా హెగ్డే ని తీసుకున్నారు.
Pooja hegde : ఆచార్య కి పూజా డేట్స్ సర్దుబాటు చేయడం చాలా కష్టమయింది.
కానీ ఆచార్య కి పూజా డేట్స్ సర్దుబాటు చేయడం చాలా కష్టమయింది. ఈమె బాలీవుడ్‌లో సల్మాన్ ఖాన్ సినిమా అలాగే, రణ్ వీర్ సింగ్ లతో సినిమా చేస్తోంది. డేట్స్ ఈ సినిమాల కోసం కేటాయించి ఆచార్యకి నో చెప్పిందట. కానీ చరణ్ చిత్ర హీరో, నిర్మాతలతో మాట్లాడి డేట్స్ సర్దుబాటు చేయించాడు. నిర్మాత చరణ్ కి చాలా క్లోజ్. అలాగే సల్మాన్ ఖాన్ కి చరణ్ కి మెగాస్టార్ కి వాళ్ళ ఫ్యామిలీ చాలా సన్నిహితంగా ఉంటారు. ఈ కారణంగా రెండు సినిమాల డేట్స్ అడ్జెస్ట్ చేసి ఆచార్య కి డేట్స్ ఇచ్చింది పూజా హెగ్డే. లేదంటే చరణ్ సరసన పూజా ఉండేది కాదు.