Ileana: దేవదాసు సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చి ఎంతో మంచి సక్సెస్ అందుకున్నటువంటి గోవా ముద్దుగుమ్మ ఇలియానా గురించి చెప్పాల్సిన పనిలేదు. మొదటి సినిమాతోనే ఎంతో మంచి సక్సెస్ అందుకొని అనంతరం మహేష్ బాబుతో పోకిరి సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చి బ్లాక్ బస్టర్ అందుకున్నారు ఈమె తెలుగు తమిళ భాష చిత్రాలలో నటిస్తూ బిజీగా మారిపోయారు.
ఈ విధంగా ఇండస్ట్రీలో ఒకప్పుడు స్టార్ హీరోయిన్గా ఓ వెలుగు వెలిగినటువంటి ఇలియానాకు అనంతరం వరుస సినిమాలో ఫ్లాప్ కావడంతో ఈమె కెరియర్ ఇబ్బందులలో పడింది దీంతో అవకాశాలు కూడా దూరమయ్యాయి ఇలా అవకాశాలు లేక బాలీవుడ్ ఇండస్ట్రీకి వెళ్ళినటువంటి ఈమెకు అక్కడ కూడా చేదు అనుభవమే ఎదురైంది. ఇలా బాలీవుడ్ ఇండస్ట్రీలో కూడా పెద్దగా సక్సెస్ కాకపోవడంతో కొంతకాలం పాటు ఇండస్ట్రీకి దూరంగా ఉన్నటువంటి ఇలియానా తిరిగి సోషల్ మీడియాలో యాక్టివ్ అయ్యారు.సోషల్ మీడియా వేదికగా ఈమె అందాల ఆరబోతతో అందరికీ పిచ్చెక్కించారు అయితే ఉన్నఫలంగా ఇలియానా తాను తల్లి కాబోతున్నాను అంటూ అందరికీ ఈ విషయాన్ని తెలియజేస్తూ షాక్ ఇచ్చారు.
అందరూ నా నడుమునే చూశారు…
ఈ విధంగా ఇలియానా ప్రస్తుతం కుమారుడికి జన్మనిచ్చి తన ఆలనా పాలన చూసుకుంటూ బిజీగా ఉన్నారు. అయితే ఈమెకు పెళ్లి జరిగిందా లేదా అన్నది మాత్రం ఇప్పటివరకు ఎవరికీ తెలియదు అయితే తరచు తన బిడ్డకు తండ్రి ఎవరు అన్న ప్రశ్న మాత్రం ప్రతి ఒక్కరిలోను మెదులుతుంది. ఇదిలా ఉండగా గతంలో ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నటువంటి ఇలియానా టాలీవుడ్ డైరెక్టర్ల గురించి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇంటర్వ్యూలో భాగంగా యాంకర్ ప్రశ్నిస్తూ మీరు చాలా మంది తెలుగు డైరెక్టర్లతో పని చేశారు అయితే ఏ డైరెక్టర్ మీకు బాగా గుర్తుండిపోయే పాత్ర ఇచ్చారని ప్రశ్నించారు ఈ ప్రశ్నకు ఇలియానా సమాధానం చెబుతూ తాను టాలీవుడ్ ఇండస్ట్రీలో డైరెక్టర్లు అందరితోనూ సినిమాలు చేసినప్పటికీ వారు ఎవరు నాలోని నటనని చూడలేదు అందరి ఫోకస్ కూడా నా నడుము పైనే ఉండేది. నా నడుమును ఎన్ని యాంగిల్స్ లో ఎలా చూపించాలి అన్నదానిపైనే దృష్టి పెట్టారు కానీ నా పాత్రకి ఎవరు ఇంపార్టెన్స్ ఇవ్వలేదు అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు దీంతో ఈ కామెంట్స్ కాస్త ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.