Telangana: తెలంగాణ ప్రభుత్వానికి ఇప్పట్లో బుద్ది వచ్చేలా లేదు. ఎందుకంటే రోజుకో సమస్య వస్తున్నా కూడా కొంచెం కూడా జాగ్రత్తలు తీసుకోవడం లేదు. నిన్న మొన్నటి వరకు లిక్కర్ స్కాం అని, గ్రూప్స్ పేపర్ లీక్ అని ప్రతిపక్షాల నాయకులు రచ్చ చేస్తున్నా కూడా బీఆర్ఎస్ ప్రభుత్వంలో మాత్రం కొంచెం కూడా మార్పు కనిపించడం లేదు. కొంచెం కూడా ముందు జాగ్రత్త కనిపించడం లేదు. నిన్నటి వరకు గ్రూప్స్ పేపర్స్ లీక్ అయ్యాయని రాష్ట్రం మొత్తం గొడవ అయ్యింది, అది ఇంకా నడుస్తుంది. అయితే ఇప్పుడు ఇవ్వాళా స్టార్ట్ ఐన టెన్త్ పరీక్షా పేపర్ కూడా లీక్ అయ్యింది. పరీక్ష స్టార్ట్ అయిన అరగంటకే పేపర్ వాట్స్ యాప్ లో ప్రత్యక్షమైంది. చాలామంది కూడా ఈ పేపర్ ను షేర్ కూడా చేసుకుంటున్నారు. అయితే పరీక్షల పట్ల, విద్యపట్ల తెలంగాణ ప్రభుత్వం ఎందుకింత నిర్లక్ష్యం వహిస్తుందో అర్థం కావడం లేదు.

అయితే పరీక్షా పేపర్ వికారాబాద్ జిల్లాలోని తాండూరు ప్రభుత్వ పాఠశాల నుండి లీక్ అయినట్టు పోలీసులు గుర్తించారు. పేపర్ బందెప్ప అనే టీచర్ పేపర్ ను వాట్స్ యాప్ ద్వారా లీక్ చేసినట్టు తెలుస్తుంది. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు టీచర్ బందెప్పను, ఎంఈఓ వెంకటయ్యను అదుపులోకి తీసుకోని విచారణ చేస్తున్నారు. ఐతే డీఈఓ మాత్రం ప్రశ్నపత్రం లీక్ కాలేదని చెప్తున్నాడు. అయితే ఇవ్వాళ ఎక్సమ్ పేపర్, లీక్ అయిన పేపర్ రెండు ఒకటేనని పోలీసులు తేల్చి చెప్పారు. అయితే ఈ లీకేజీ విషయంలో బందెప్పను, వెంకటయ్యను అధికారులు విచ్చిరిస్తున్నారు. అయితే ఈ పేపర్ లీక్ లు మొత్తం తెలంగాణలోనే ఎందుకు జరుగుతున్నాయో అర్థం కావడం లేదు.
ఈ తెలంగాణ ప్రభుత్వానికి అస్సలు బుద్ధి ఉందొ లేదో అస్సలు అర్థం కావడం లేదు. కనీసం పరీక్షలను కూడా ఎలాంటి ఇబ్బందులు లేకుండా నిర్వహించలేకపోతుంది . మొన్న గ్రూప్స్ పరీక్షా పత్రాలు లీక్ కావడంతోనే నిరుద్యోగులు నానా ఇబ్బందులు పడ్డారు. ఇప్పుడు మళ్ళీ టెన్త్ పేపర్ కూడా లీక్ కావడంతో విద్యార్థుల్లో ఆందోళన మొదలైంది. లాస్ట్ ఇయర్ కూడా ఇలానే పరీక్షా ఫలితాలు విడుదల సమయంలో అవకతవకలు జరగటం వల్ల, తప్పు రిజల్ట్ రావడం వల్ల చాలామంది విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్నారు. ప్రభుత్వం చదువు పట్ల ఎందుకు ఇలా నిర్లక్ష్యంగా ఉందొ ఎవ్వరికి అర్థం కావడం లేదు.