Akhil : అఖిల్ అక్కినేని..త్వరలో ఏజేంట్ సినిమా షూటింగ్ మొదలు పెట్టబోతున్నాడు. ఈపాటికే ఈ సినిమా షూటింగ్ మొదలవ్వాల్సి ఉండగా కరోనా సెకండ్ వేవ్ కారణంగా సురేందర్ రెడ్డి బృందం షూటింగ్ డేట్‌ని పోస్ట్ పోన్ చేశారట. అయితే అఖిల్ ఇప్పటి వరకు చేసిన ఏ సినిమాకి రాని క్రేజ్ ఏజెంట్ సినిమా జస్ట్ టైటిల్ పోస్టర్‌తో పాటు అఖిల్ లుక్‌కి వచ్చింది. అఖిల్ మనం సినిమాలో జస్ట్ రెండు నిముషాలు కనిపించి అందరినీ ఆకట్టుకున్నాడు. దర్శకుడు విక్రం కుమార్ అక్కినేని ఫ్యామిలీ మొత్తాన్ని మనం సినిమాలో చూపించాలనుకున్నప్పుడు అఖిల్ ప్రస్తావన లేదు.

is-akhil-succeeds-like-an-agent
is-akhil-succeeds-like-an-agent

అయితే షూటింగ్ జరుగుతున్న సమయంలో అఖిల్ కూడా కాసేపు కనిపిస్తే ఫుల్ ఫిల్ అవుతుందని అక్కినేని ఫ్యామిలీ డిసైడవడంతో క్లైమాక్స్‌లో రెండు నిముషాల సీన్ క్రియేట్ చేశాడు. స్లో మోషన్‌లో అఖిల్ బిల్డప్ షాట్స్ బాగా ఎలివేట్ చేశాయి. దాంతో అఖిల్ హాలీవుడ్ హీరోలా కనిపించాడు. ఇమీడియట్‌గా అఖిల్ హీరో అవ్వాల్సిందే అని అభిమానుల్లో ప్రచారం జరిగింది. అక్కినేని వారసుడు. హీరో అవ్వాలంటే ఎంత సేపు. అందుకే నితిన్ నిర్మతగా…స్టార్ డైరెక్టర్ వి.వి.వినాయక్ డైరెక్టర్‌గా అఖిల్ సినిమా చేశాడు.

Akhil : అఖిల్‌కి ఏజెంట్ ఎలాంటి సక్సస్ ఇస్తుందో..?

ఈ సినిమా భారీ డిజాస్టర్ కావడంతో నెక్స్ట్ సినిమాలని భారీగా ప్లాన్ చేశారు. కానీ ఆ తర్వాత వచ్చిన హలో..మిస్టర్ మజ్ఞు సినిమాలు కూడా పెద్దగా మెప్పించలేకపోయాయి. ఇప్పుడు హోప్స్ మొత్తం మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్ సినిమా మీదే పెట్టుకున్నాడు అఖిల్. ఈ సినిమా అవుట్ పుట్ అద్భుతంగా వచ్చిందని అఖిల్ ఫస్ట్ హిట్ అందుకోవడం ఖాయమని చెప్పుకుంటున్నారు. కాగా సురేందర్ రెడ్డి దర్శకత్వంలో అఖిల్ చేయబోతున్న 5వ సినిమా ఏజెంట్ మీద ఒక్క ఫస్ట్ లుక్‌తో మంచి అంచనాలు ఏర్పడ్డాయి. చూడాలి మరి ఏజెంట్ అఖిల్‌కి ఎలాంటి సక్సస్ ఇస్తుందో.

Stay on top of the game with the latest updates on Telugu latest news today! Experience the thrill of LIVE Telugu news updates like never before, only on Teluguonlinenews.com.

Mail

Published on ఏప్రిల్ 19, 2021 at 1:42 సా.