Kriti Sanon : బాలీవుడ్ నుంచి టాలీవుడ్ కి వచ్చి బాగానే సక్సెస్ అయినటువంటి హీరోయిన్లు ఇండస్ట్రీలో చాలామంది ఉన్నారు. ఈ క్రమంలో వచ్చి రావడంతోనే స్టార్ హీరోల సరసన నటించే ఆఫర్లు దక్కించుకొని ఇక్కడ అంత ఇంతో క్రేజ్ రాగానే మళ్లీ బాలీవుడ్ కి చెక్కేసిన హీరోయిన్లు కూడా లేకపోలేదు. అయితే తెలుగులో ప్రముఖ దర్శకుడు సుకుమార్ మరియు సూపర్ స్టార్ మహేష్ బాబు తదితరుల కాంబినేషన్లో తెరకెక్కిన వన్ నేనొక్కడినే చిత్రంలో హీరోయిన్ గా నటించి టాలీవుడ్ వెండితెరకు హీరోయిన్ గా పరిచయమైన యంగ్ బ్యూటిఫుల్ హీరోయిన్ కృతి సనన్ గురించి సినీ ప్రేక్షకులకు కొత్తగా తెలియజేయవలసిన అవసరం లేదు.
అయితే ఈ చిత్రంలో జర్నలిస్టు పాత్రలో నటించి తన అందం, అభినయం నటన ప్రతిభతో ప్రేక్షకులను కట్టిపడేసింది. దీంతో ఈ చిత్రంలో నటించిన తర్వాత ఈ అమ్మడికి వెంటనే నాగచైతన్య హీరోగా నటించిన దోచేయ్ చిత్రంలో హీరోయిన్ గా ఆఫర్ వచ్చింది. కానీ ఈ దోచేయ్ చిత్రం ప్రేక్షకులను పెద్దగా ఆకట్టుకోకపోవడంతో ఈ బ్యూటీకి సరైన హిట్లు పడలేదు. అయినప్పటికీ చాలామంది దర్శక నిర్మాతలు కృతి సనన్ కి సినిమా అవకాశాలు ఆఫర్ చేసినప్పటికీ ఈ అమ్మడు మాత్రం బాలీవుడ్ పై ఉన్నటువంటి మోజు కారణంగా టాలీవుడ్ ని పక్కన పెట్టేసింది. అయితే బాలీవుడ్ కి వెళ్లిన తర్వాత ఈ బ్యూటీ ఆఫర్లు బాగానే దట్టించుకొని రాణిస్తోంది.
అయితే తాజాగా ఉన్నటి కృతి సనన్ గురించి ఓ వార్త సోషల్ మీడియా మాధ్యమాలలో తెగ వైరల్ అవుతుంది. అయితే ఇంతకీ ఆ వార్త ఏమిటంటే నటి కృతి సనన్ ముంబైలో ఉన్నటువంటి తన ఖరీదైన అపార్ట్మెంట్ కి పక్కనే బాలీవుడ్ ప్రముఖ దర్శకుడు అయిన ఆనంద్ ఎల్ రాయ్ కూడా సొంతంగా ఓ ఫ్లాట్ ని కొనుక్కున్నాడట. అయితే ఈ ఫ్లాట్ ఖరీదు దాదాపుగా 40 కోట్ల రూపాయలక పైగా విలువ చేస్తుందని సమాచారం. అయితే నటి కృతి సనన్ నివాసం ఉంటున్న ఇల్లు బాలీవుడ్ ప్రముఖ స్టార్ హీరో అయిన అమితాబ్ బచ్చన్ కి చెందినదట.. కాగా ఈ ఫ్లాట్ నెల అద్దె కూడా దాదాపుగా 5 లక్షల రూపాయలకు పైగా ఉంటుందని తెలుస్తోంది. అయితే కృతి సనన్ పొరుగింట్లోకి బాలీవుడ్ ప్రముఖ దర్శకుడు మారడంతో ప్రస్తుతం ఈ విషయం గురించి సోషల్ మీడియా మాధ్యమాలలో తెగ చర్చలు జరుగుతున్నాయి. అలాగే కోట్ల రూపాయలు పారితోషకం తీసుకునేటువంటి కృతి సనన్ కి ఇప్పటివరకు సొంత ఇల్లు లేకపోవడంతో ఈ విషయం గురించి కూడా నెటిజన్లు పలు రకాలుగా చర్చించుకుంటున్నారు.
ఈ విషయం ఇలా ఉండగా అప్పట్లో నటి కృతి సనన్ బాలీవుడ్ చలనచిత్ర పరిశ్రమలో వరుసగా సినిమా ఆఫర్లు తలుపు తట్టినప్పటికీ కథల విషయంలో సరైన నిర్ణయాలు తీసుకోలేకపోయింది. దీంతో కొంతమేర డిజాస్టర్లను అందుకుంది. తాజా సమాచారం ప్రకారం ఈ అమ్మడి కెరియర్ కొంతమేర మందగించినట్లు తెలుస్తోంది. అందుకే ఈ బ్యూటీ మళ్ళీ టాలీవుడ్ లో ఆఫర్ల కోసం ప్రయత్నాలు చేస్తున్నట్లు కూడా పలు వార్తలు బలంగా వినిపిస్తున్నాయి.