Anushka : అనుష్క శెట్టి 15 ఏళ్ళ క్రితం సూపర్ సినిమాతో టాలీవుడ్‌లో హీరోయిన్‌గా గ్రాండ్ ఎంట్రీ ఇచ్చింది. ఈ సినిమాలో అక్కినేని నాగార్జున సోనూసూద్ లతో కలిసి అనుష్క నటించి ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. డైరెక్టర్ పూరి జగన్నాధ్ అనుష్క కి కెరీర్ బెస్ట్ హిట్ గా సూపర్ సినిమా ఇచ్చాడు. మొదటి సినిమానే సూపర్ హిట్ అవడంతో ఇక అనుష్క సినిమాల పరంగా వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం రాలేదు. టాలీవుడ్‌లో చాలా సూపర్ హిట్స్ అందుకుంది. ప్రయోగాలకు అనుష్క ఎప్పుడు ముందుంటుంది.

అరుంధతి తర్వాత అనుష్క సినిమా కెరీర్ ఏ రేంజ్‌కు చేరుకుందో అందరికీ తెలిసిందే. అయితే ఈ సినిమా తెచ్చిన క్రేజ్ తో అనుష్క ఆ తర్వాత ఎక్కువగా లేడీ ఓరియెంటెడ్ సినిమాలు చేసేందుకు ఆసక్తి చూపించింది. దర్శక, నిర్మాతలు కూడా అనుష్కతో కమర్షియల్ సినిమాలు కాకుండా లేడీ ఓరియెంటెడ్ సినిమాలు చేసేందుకు క్యూ కట్టారు. ఈ క్రమంలోనే సైజ్ జీరో సినిమా చేసింది. ఈ సినిమా కోసం అనుష్క తనని తాను పూర్తిగా మార్చుకుంది. కానీ ఇదే అనుష్క సినిమా కెరీర్‌కు చాలా వరకు మైనస్ అయింది.
Anushka : అనుష్కకి బాహుబలి తర్వాత సరైన సినిమా పడలేదు.
అసలే భారీ కటౌట్ ..సైజ్ జీరో సినిమాతో ఫిజిక్‌లో చాలా మార్పులు రావడంతో తన కోసం క్యూ కట్టిన దర్శక, నిర్మాతలే కాస్త వెనకడుగు వేశారు. అయితే బాహుబలి లాంటి సినిమా అనుష్క కెరీర్ లో ఉండటం గొప్ప విశేషం. పాన్ ఇండియన్ సినిమాలో అవకాశం అందుకుందంటే అది అనుష్క క్రేజ్ అని చెప్పాలి. ఈ సినిమా తర్వాత అనుష్కకి సరైన సినిమా పడలేదు. దాంతో కెరీర్ కాస్త డల్ అయింది. ఈ నేపథ్యంలో పెళ్ళి ఆలోచన చేస్తున్నట్టు టాక్ వినిపిస్తోంది. గత ఏడాదిగా టాలీవుడ్‌లో చాలా మంది పెళ్ళి చేసుకొని కొత్త జీవితం ప్రారంభించారు. ఆ లిస్ట్‌లో అనుష్క కూడా చేరనుందని అంటున్నారు. అందుకే కొత్త ప్రాజెక్ట్స్ కమిటవడం లేదని తెలుస్తోంది. ప్రస్తుతం యూవీ క్రియేషన్స్ నిర్మించబోతున్న ఒక సినిమానే ఒప్పుకుంది.