Balakrishna : నటసింహం నందమూరి బాలకృష్ణ ఫ్యాక్షన్ సినిమాలతో తనకంటూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని సంపాదించుకున్నారు. సీనియర్ స్టార్ హీరోలలో తన స్థానం సుస్థిరం. నందమూరి తారకరామారావు నట వారసుడిగా ఎంట్రీ ఇచ్చిన బాలయ్య తన మార్క్ నటనతో ఆశేష జనాన్ని ఆకట్టుకున్నాడు. ఎందరో అభిమానులను సంపాదించుకున్నారు. బాలయ్య ఏం చేసిన మొహం మీదే..తెలిసిపోతుంది. ఆయన అభిమానుల మీద చూపించే ప్రేమ..అభిమానం బహిర్గతంగా చూపిస్తుంటారు.
ఇంత ప్రేమ బాలయ్యలో అప్పుడప్పుడు కట్టలు తెంచుకునే కోపం కూడా కనిపిస్తుంటుంది. ఏదీ మనసులో దాచుకునే తత్వం కాకపోవడమే ఇందుకు కారణం. ఆ క్షణంలో ఏదైతే మనసుకు అనిపిస్తుందో అదే చేసేస్తారు. ఇది అభిమానులకు ఇష్టంగా అనిపించినప్పటికి కొందరు మాత్రం బాలయ్య ప్రవర్తనను తప్పు పడుతుంటారు. ఎంత ముక్కుసూటితనం ఉంటే మాత్రం ఇలా బయటకి చూపించడం ఏంటని కామెంట్స్ చేస్తున్నారు. ముఖ్యంగా ఆయన కోపోద్రికుడై చేయి చేసుకోవడం పెద్దగా నచ్చదు.
Balakrishna : పూరి జగన్నాథ్, సంగీత దర్శకుడు అనూప్ రుబెన్స్ సక్సెస్ అయ్యారు.
అయినా ఆయన పద్దతి అంతే. ఏదైనా ఖచ్చితంగా ఉండాలనుకునే తత్వం. ఇక ఆయన చేసే మరో పని ఎంజాయ్ చేసేవాళ్ళు ..అబ్బా అనుకునే వాళ్ళు ఉన్నారు. అదే ఆయన పాట పాడటం. పైసా వసూల్ లో మావా ఎక్ పెగ్ లా అనే పాట పాడాడు. ఇది అభిమానులను బాగానే ఆకట్టుకుంది. ఎంతోమంది గతంలో బాలయ్యతో పాట పాడించాలని ఫెయిల్ అయ్యారు. కానీ పూరి జగన్నాథ్, సంగీత దర్శకుడు అనూప్ రుబెన్స్ సక్సెస్ అయ్యారు. దాంతో ఆయన బర్త్ డే కి తండ్రి సినిమా జగదేకవీరుని కథలోని శివ శంకరీ శివానంద లహరీ పాడారు. కానీ ఇది చెడకొట్టారనే కామెంట్స్ వచ్చాయి. కాగా మరోసారి ఎన్.టి.ఆర్ జయంతి సందర్భంగా శ్రీరామ దండకం ఆలపించారు. దీనికి ఎలాంటి కామెంట్స్ వస్తాయో చూడాలి.