BJP: బిజేపి నాయకులకు ఉన్నంత హిపోక్రసీ ఏ పార్టీలోని నాయకులకు ఉండదు. ఎందుకంటే వీళ్ళు ఇష్టమొచ్చినట్టు మాటలను మార్చేస్తు ఉంటారు. అలాగే ఈ బిజేపి నాయకులకు రాష్ట్రం ప్రశాంతంగా ఉంటే నచ్చదు, వాళ్ళకు ఎప్పుడూ ఏదో ఒక గొడవ జరుగుతూ ఉండాలి, దాన్ని మళ్ళీ పొలిటికల్ వాడుకొని, దాన్నితో ప్రజల్లో ఇంకాస్త గొడవలు రేపాలని చూస్తూ ఉంటారు. తెలంగాణలో ఉన్న నాయకులు కూడా సేమ్ అలానే ఉన్నారు. ఏ చిన్న వివాదం జరిగినా దాన్ని రాజకీయం చేయడానికి చూస్తున్నారు. ఇప్పుడు తాజాగా మీడియా ఫ్రీడం అనే పదాన్ని తీన్మార్ మల్లన్న పుణ్యమా అని ఎత్తుకున్నారు. ఇప్పుడు ఎక్కడికి వెళ్ళినా కూడా అదే మాటను చెప్తూ, కేసీఆర్ మీడియా ఫ్రీడంను చంపేస్తున్నాడాని హడావిడి చేస్తున్నారు. సేమ్ ఇదే బిజేపి అధికారంలో ఉన్న రాష్ట్రాలలో మీడియాను, జర్నలిస్ట్ లను ఎలా ట్రీట్ చేస్తున్నారో అందరికీ తెలుసు.
దేశంలో బిజేపికి ఎవరు కొంచెం వ్యతిరేకంగా మాట్లాడితే వాళ్ళపై కేసులు పెడుతూ, జైలల్లో పెడుతూ, ఇంకా కావాలంటే ఆ మీడియా హౌస్లను కొనేస్తు ఉంటారు. ఇలాంటి బిజేపి నాయకులు ఇప్పుడు మీడియా ఫ్రీడం గురించి మాట్లాడుతుంటే నవ్వొస్తుంది. మధ్యప్రదేశ్ లో బిజేపి పార్టీనే అధికారంలో ఉంది. అక్కడ ఒక యూట్యూబ్ చానెల్ ఒక ఎమ్మెల్యేకి వ్యతిరేకంగా మాట్లాడారని, వాళ్ళను బట్టలిప్పీపోలీస్ స్టేషన్ లో నిలబెట్టింది ఈ బిజేపి నాయకులే. గౌరి లంకేశ్ మరణం వెనక కూడా బిజేపి హస్తం ఉందని అప్పట్లో చాలపెద్ద ఎత్తున ప్రచారం జరిగినది. అలాగే ఉత్తర ప్రదేశ్ లో యోగి అధిత్యనాథ్ అధికారంలోకి వచ్చిన తరువాత 48 మంది జర్నలిస్టులపై దాడి, 66 మందిపై కేసులు నమోదు, 12 మంది మృతి చెందటం జరిగింది. ఇంతా చేస్తున్న బీజేపీ నాయకులు ఇప్పుడు మీడియా ఫ్రీడమ్ గురించి మాట్లాడుతుంటే నవ్వొస్తుంది.
కేవలం అధికారం కోసం తప్పా ప్రజల గురించి ఆలోచించని ఈ బీజేపీ నాయకులు ఇప్పుడు ప్రజల గురించి, మీడియా ఫ్రీడమ్ గురించి మాట్లాడుతుంటే నవ్వొస్తుంది. అయినా తీన్మార్ మల్లన్న ఏమి హోల్ మీడియాకు రెప్రెసెంటేటివ్ కాదు. తన పర్సనల్ గ్రడ్జ్ ను చూపిస్తూ, వార్తలు చెప్తున్న మల్లన్న కోసం మీడియా ఫ్రీడమ్ అనే పదం యూస్ చెయ్యడం కూడా కరెక్ట్ కాదు. మల్లన్న వేరు, మీడియా వేరు. మల్లన్న చేస్తున్నది పర్సనల్ రాజకీయమే కానీ మీడియా వృత్తి కాదు.