Bjp: రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడిగా బండి సంజయ్ ను నియమించిన తరువాత బీజేపీలో నూతన ఉత్సాహం వచ్చింది. బండి సంజయ్ కంటే ముందు తెలంగాణలో బీజేపీ ఉన్నట్టు కూడా ఎవ్వరికీ తెలియదు. కానీ సంజయ్ మాత్రం దూకుడుగా కేసీఆర్ మీద, బీఆర్ఎస్ మీద విరుచుకుపడడంతో పాటు ప్రజల్లో మత పిచ్చిని కూడా ప్రజల్లో నింపగలిగారు. అలాంటి బండి సంజయ్ కు ఇప్పుడు ఈటెల రాజేందర్ నుండి ఇబ్బందులు వస్తున్నాయని వార్తలు వస్తున్నాయి. బండి సంజయ్ ను రాష్ట్ర అధ్యక్షుడి పదవి నుండి తొలగించడానికి బీజేపీ పెద్దలు ప్రయత్నాలు చేస్తున్నారని రాజకీయ వర్గాలు చర్చించుకుంటున్నారు. మొన్నటి వరకు బీఆర్ఎస్ లో ఉన్న ఈటెల రాజేందర్, కేసీఆర్ తో గొడవలు పడటం వల్ల ఇప్పుడు బీజేపీలో వచ్చి, ఉప ఎన్నికలకు వెళ్లి మరీ విజయాన్ని సాధించారు. బీఆర్ఎస్ లో ఉన్నప్పుడు చాల ఇంపార్టెంట్ పోసిషన్ లో ఈటెల ఉండేవారు. కానీ ఇప్పుడు బీజేపీలో ఈటెల కేవలం ఒక కార్యకర్తలాంటి వారు మాత్రమే.
ఈటెల అధ్యక్షుడా!!
బీజేపీలోకి వచ్చిన వెంటనే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి, ఉప ఎన్నికకు వెళ్లి, బీఆర్ఎస్ అభ్యర్థిని చాలా చిత్తుగా ఓడించారు. ఈ విజయంతో బీజేపీకి రాష్ట్రంలో చాలా హెల్ప్ అయ్యింది, పార్టీ గురించి ప్రజల్లో చాలామందికి తెలిసింది, అలాగే బీజేపీ కెపాసిటీ ఏంటో కూడా బీఆర్ఎస్ కు అర్థమయ్యేలా చేశారు. బీజేపీకి కొత్త ఊపు తెచ్చిన ఈటెల రాజేందర్ కు పార్టీ అధ్యక్షుడిగా నియమించడానికి బీజేపీ పెద్దలు అడుగులు వేస్తున్నారు. పైగా రాజేందర్ కు తెలంగాణ ఉద్యమంలో కూడా కీలకపాత్ర ఉంది కాబట్టి అలాంటి వారి చేతిలో పార్టీ పెడితే, వచ్చే ఎన్నికలో తెలంగాణ సెంటిమెంట్ ను కూడా వాడుకోవచ్చని బీజేపీ పెద్దలు ప్లాన్ చేస్తున్నారని సమాచారం. ఇప్పుడు టీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ గా మారడం వల్ల తెలంగాణ సెంటిమెంట్ ను వాడుకోవడానికి వీలులేదు కాబట్టి, ఆ సెంటిమెంట్ ను వాడుకోవడానికి ఈటెలను రంగంలోకి దింపడానికి బీజేపీ ప్రయత్నిస్తుంది. ఒకవేళ ఇదే జరిగితే బీజేపీకి చాల హెల్ప్ అవుతుంది.
ఢిల్లీకి సంజయ్
రాష్ట్ర అధ్యక్ష పదవి నుండి సంజయ్ ను తప్పించి, కేంద్ర మంత్రిగా నియమించడానికి బీజేపీ పెద్దలు వ్యూహాలు రచిస్తున్నారు. సంజయ్ కి కేంద్ర మంత్రి పదవి ఇస్తే, పార్టీ కోసం ఇంకా గట్టిగా పని చేసే అవకాశం సంజయ్ ఇచ్చినట్టు అవుతుందని బీజేపీ వర్గాలు అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. ఎలాంటి పదవి లేనప్పుడు పార్టీ కోసం సంజయ్ ఇంతలా కష్టపడుతుంటే, ఇక పదవి ఇస్తే ఇంకెలా పని చేస్తాడోనని పెద్దలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. అయితే రాష్ట్రంలో ఉన్న సంజయ్ ను ఢిల్లీకి తీసుకెళ్తే, ఇక్కడసంజయ్ బలంగా పని చేసే అవకాశం ఉండదని, బండిని ఇక్కడ ఉంచితేనే బీజేపీకి లాభమని అభిప్రాయాలూ కూడా వ్యక్తమవుతున్నాయి.