BRS: ఇప్పటికే రాష్ట్రంలో బీజేపీ ఎంత ముందుకు రావాలో అంత ముందుకు వచ్చింది. ఇంకొంచెం ఛాన్స్ ఇస్తే వచ్చే ఎన్నికల్ సమయానికి రాష్ట్రంలో బీజేపీ ప్రధాన ప్రతిపక్షంగా తయారైనా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. అందుకే ఆ పార్టీ వచ్చి తమ పార్టీ నేతలను లాక్కెళ్ళకుండా ఉండటానికి, తమ పార్టీ నేతల్లో ఉత్సాహం నింపడానికి బీఆర్ఎస్ పార్టీ ఆత్మీయ సమ్మేళనాలు ఏర్పాటు చేస్తున్నారు. ఇప్పుడు ఆ సమ్మేళనాల వల్ల బీజేపీ ఎక్కడలేని మంచి జరుగుతుందని బీఆర్ఎస్ నేతలే చెప్తున్నారు. ఎందుకంటే ఈ సమ్మేళనాల వల్ల పార్టీలో ఉన్న లోపాలాన్ని కూడా ఒకదాని తరువాత ఇంకోటి బయటకు వస్తున్నాయి. ఆలోపాలను పట్టుకొని ఇప్పుడు బీజేపీ రాజకీయం చెయ్యడానికి బయలుదేరింది.
పార్టీ బొక్కలు బయటకు వస్తున్నాయి
పార్టీలో సఖ్యత పెంచడానికాని ప్లాన్ చేసిన సమ్మేళనాలు ఇప్పుడు పార్టీలో ఉన్న బొక్కలన్ని బయటకు వచ్చేలా చేస్తున్నాయి. పార్టీ పెద్దలకు, కింది స్థాయి కార్యకర్తలకు మధ్య ఉన్న గొడవలన్ని ఇప్పుడు ఇప్పుడు మీడియా ముందుకు వస్తున్నాయి. మొన్నటి లోపలలోపల ఉన్న గొడవలన్నీ ఇప్పుడు పెద్ద మైక్ పెట్టి మరీ నాయకులూ చెప్పుకుంటున్నారు. మహబూబాబాద్ లో జరిగిన ఆత్మీయ సమ్మేళన సభలో రెడ్యా నాయక్ తనకు సరైన గౌరవం ఇవ్వలేదని, అక్కడ ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలల్లో తన ఫోటో అయన చేసిన రచ్చ అంతా ఇంతా కాదు. ఇలా రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నోచోట్ల పార్టీ అంతర్గత గొడవలు బయటకు వస్తున్నాయి. ఈ సమ్మేళన సభలు వచ్చే నెల 25వరకు జరగనున్నాయి. అప్పటి వరకు ఇంకెన్ని గొడవలు బయటకు వస్తాయో చూడాలి.
బీజేపీ వాడుకుంటుంది
ఆత్మీయ సమ్మేళనంలో జరుగుతున్న గొడవలను బీజేపీ నాయకులు వాడుకుంటున్నారు. అలాగే బీఆర్ఎస్ లో ఉంటూ, అసంతృప్తిగా ఉన్న నాయకులను పట్టుకోవడానికి బీజేపీ ఈసభలను వాడుకుంటుంది. అక్కడ గొడవలు పడుతున్న నాయకులను పార్టీలోకి ఆహ్వానిస్తూ, గోతి కాడ కుక్కలా బీజేపీ నాయకులు ప్రవర్తిస్తున్నారు. ఈసభలు అయ్యేలోపు బీజేపీలో చేరే బీఆర్ఎస్ నాయకుల సంఖ్య విపరీతంగా పెరిగే అవకాశం ఉంది. బీజేపీకి సొంతంగా రాజకీయాలు చెయ్యడం చేతకాదు అందుకే ఇలా వేరేపార్టీలో ఉన్న నేతలను పార్టీలోకి వచ్చే ఎన్నికల్లో పోటీకి సిద్ధమైతుంది.