F 3 : ఎఫ్ 3 విక్టరీ వెంకటేష్ – మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ నటిస్తున్న భారీ మల్టీస్టారర్. తమన్నా, మెహ్రీన్ హీరోయిన్స్ గా నటుస్తున్నారు. సక్సస్ ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ సినిమాను శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై టాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు శిరీష్ తో కలిసి నిర్మిస్తున్నారు. అనిల్ రావిపూడి – వెంకటేష్ -వరుణ్ తేజ్ కాంబినేషన్ లో ఇంతక ముందు వచ్చిన బ్లాక్ బస్టర్ ఎఫ్ 2 కి సీక్వెల్ గా ఎఫ్ 3 రూపొందుతున్న సంగతి తెలిసిందే.

is carona effects  F3.... ?
is carona effects F3…. ?

దాదాపు ఎఫ్ 2 కి పనిచేసిన టీం మొత్తం ఎఫ్ 3 కి పని చేస్తుండటం తో అభిమానుల్లో .. ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఏర్పడ్డాయి. సినిమా మొదలైనప్పుడే కొంత బిజినెస్ కూడా జరిగిందని వార్తలు వచ్చాయి. ఇక రెట్టింపు ఉత్సాహంతో చిత్రీకరణ శరవేగంగా సాగుతుండగా కరోనా బ్రేక్ వేసింది. ఈ సినిమా దర్శకుడు అనిల్ రావిపూడికి కరోనా సోకడంతో షూటింగ్ ని నిలిపివేశారు. ఏప్రిల్ 13న అనీల్ రావిపూడి కోవిడ్ బారిన పడ్డటంతో ఐసోలేషన్ కు వెళ్ళారు. తాజాగా అనిల్ రావిపూడి నెగిటివ్ వచ్చిందని అఫీషియల్ గా ప్రకటించారు.

F 3 : ఎఫ్ 3 రిలీజ్ అని మేకర్స్ అధికారకంగా ప్రకటించారు.

కానీ ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో వెంటనే ఎఫ్ 3 షూటింగ్ మొదలు పెట్టేలా కనిపించడం లేదు. దాంతో ఈ సినిమా రిలీజ్ మీద ప్రభావం పడుతుందని ఇప్పుడు ఇండస్ట్రీలో టాక్ మొదలైంది. అంతేకాదు నిర్మాత దిల్ రాజు, దర్శకుడు అనిల్ రావిపూడి సంక్రాంతి సెంటిమెంట్ ప్రకారం 2022 సంక్రాంతికి రిలీజ్ చేసే ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తోంది. ఆగస్టు 27న ఎఫ్ 3 రిలీజ్ అని మేకర్స్ అధికారకంగా ప్రకటించారు. కానీ ఏప్రిల్ నెల నుంచి రిలీజ్ కావాల్సిన సినిమాలన్ని పోస్ట్ పోన్ అవుతున్నాయి. కాబట్టి ఆ ప్రభావం కూడా ఉంటుందని చెప్పుకుంటున్నారు. చూడాలి మరి ఏం జరుగుతుందో.

Stay on top of the game with the latest updates on Telugu latest news today! Experience the thrill of LIVE Telugu news updates like never before, only on Teluguonlinenews.com.

Mail

Published on ఏప్రిల్ 28, 2021 at 6:41 సా.