Devi Sri Prasad

Devisriprasad : టాలీవుడ్ కోలీవుడ్ లో రాక్ స్టార్ దేవీశ్రీప్రసాద్ కి మ్యూజిక్ సెన్షేషన్ గా ఎలాంటి క్రేజ్ ఉందో అందరికీ తెలిసిందే. ఆయన సినిమాకి మ్యూజిక్ కంపోజ్ చేస్తున్నాడంటే ఆ సినిమా మ్యూజికల్ గా గ్యారెంటీగా పెద్ద హిట్ అని అందరూ ఫిక్స్ అవుతారు. దేవీ ఇచ్చే ట్యూన్స్ హీరోలతో ఎనర్జీ స్టెప్స్ వేయిస్తాయి. తమలోని గాయకులను బయటకి తీసుకు వచ్చి పాటలు పాడిస్తాయి. అంతగా దేవీ తన మ్యూజిక్ తో మ్యాజిక్ చేసి హీరోలతో, దర్శక, నిర్మాతలతో శభాష్ అనిపించుకున్నాడు. సత్యమూర్తి గారి కొడుకు అనే భావం ఇండస్ట్రీలో అందరికీ ఉన్నా కూడా దేవీ ఇండస్ట్రీకొచ్చిన అతికొద్దిరోజుల్లోనే తనకంటూ ఒక ప్రత్యేకమైన పేరును స్థానాన్ని సంపాదించుకున్నాడు.

is devisriprasad-rejected as-a-hero
is devisriprasad-rejected as-a-hero

టాలీవుడ్ లో కోలీవుడ్ లో దాదాపు అందరి హీరోల సినిమాలకి పని చేసిన దేవీశ్రీప్రసాద్ అందరి హీరోలకి భారీ హిట్స్ ఇచ్చాడు. హీరో ఎంత సీనియర్ స్టార్ అయినా ఆడియో ఫంక్షన్స్‌లో దేవీ స్టెప్పులేయిస్తాడు. ఇక దేవీశ్రీప్రసాద్ తన మ్యూజిక్ టీమ్ తో కలిసి సినిమా ప్రమోషన్‌ని బాగా చేస్తాడు. రీ రికార్డింగ్ విషయంలో కూడా ఈ మ్యూజిక్ డైరెక్టర్ కి మంచి పేరుంది. ఎంత బిజీగా ఉన్నా ఒక్కో సినిమాకి కనీసం 15 రోజులైనా రీ రికార్డింగ్ పై వర్క్ చేస్తాడు. సాంగ్స్ లో ఉన్న క్యాచీ ట్యూన్స్ నే చాలా వరకు నేపథ్యం సంగీతంలోనూ ఉపయోగిస్తాడు. అందుకే ఫ్యామిలీ ఆడియన్స్ బాగా కనెక్ట్ అవుతారు. ఫీల్ గుడ్ మ్యూజిక్ ఇచ్చే దేవీ సినిమా సక్సెస్ కి మేజర్ క్రెడిట్ మ్యూజిక్ దే అనేలా పనిచేస్తాడు.

Devisriprasad : హీరోగా కెరీర్ పోయి ఇటు మ్యూజిక్ డైరెక్టర్ గా కెరీర్ పోయి దెబ్బతింటాడని సన్నిహితులు చెప్పారట.

అయితే ప్రతీ సినిమా ఆడియో ఫంక్షన్స్ లో దేవీ ఆటా పాటా హుషారు చూసి చాలా మంది హీరోగా చేయమని సలహాలిచ్చారట. దాంతో ఈయన కూడా హీరో అయిపోదామని డిసైడయ్యాడు. అప్పట్లో దీనికి సంబంధించిన ఓ ప్రకటన కూడా వచ్చింది. కానీ సినిమా పట్టాలెక్కకుండానే ఆగిపోయింది. అందుకు కారణం దేవీశ్రీప్రసాద్ హీరోగా అంటే జనాలు సరిగ్గా రిసీవ్ చేసుకోరేమో అని సందేహాలు కలగడమే. ఒకవేళ అలా జరిగితే అటూ హీరోగా కెరీర్ పోయి ఇటు మ్యూజిక్ డైరెక్టర్ గా కెరీర్ పోయి దెబ్బతింటాడని సన్నిహితులు చెప్పారట. అందుకే హీరోగా ఎంట్రీ ఇవ్వాల్సిన దేవీశ్రీప్రసాద్ సినిమా ఆగిపోయి ఆయన మ్యూజిక్ డైరెక్టర్‌గానే కంటిన్యూ అవుతున్నాడు. అయితే తాజాగా మాత్రం దేవీశ్రీప్రసాద్ మళ్ళీ హీరోగా మారిపోతున్నాడని ఈ సినిమాకి ఛార్మి నిర్మాతగా వ్యవహరించబోతోందని వార్తలు వస్తున్నాయి.

Stay on top of the game with the latest updates on Telugu latest news today! Experience the thrill of LIVE Telugu news updates like never before, only on Teluguonlinenews.com.

Mail

Published on జూలై 1, 2021 at 9:30 ఉద.