M.S.RAJU : ఎం.ఎస్.రాజు..ప్రముఖ నిర్మాణ సంస్థ సుమంత్ ఆర్ట్ ప్రొడక్షన్స్ ని స్థాపించి ఎన్నో బ్లాక్ బస్టర్ సినిమాలు నిర్మించారు. విక్టరీ వెంకటేశ్‌తో శత్రువు ఆయన నిర్మించిన మొదటి సినిమా. ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ సాధించింది. ఆ తర్వాత పోలీస్ లాకప్, స్ట్రీట్ ఫైటర్ సినిమాలు నిర్మించారు. అయితే దేవి ఆయన కి భారీ హిట్ ఇచ్చింది. శత చిత్రాల దర్శకుడు కోడి రామకృష్ణ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా నిర్మాణ సంస్థ పేరు ప్రతిష్టలను రెట్టింపు చేసింది. భారీ హిట్ సాధించిన ఈ సినిమాతో ఎం.ఎస్.రాజు ఇండస్ట్రీలో అగ్ర నిర్మాతగా మారారు.

is it a big mistake by MSRaju ti become a director

ఆ తర్వాత తీసిన దేవీ పుత్రుడు నిరాశ పరచింది. అయితే వి.ఎన్.ఆదిత్య ని దర్శకుడిగా పరిచయం చేస్తూ ఆయన నిర్మించిన మనసంతా నువ్వే మళ్ళీ భారీ హిట్ సాధించింది. ఉదయ కిరణ్, రీమా సేన్ జంటగా నటించిన ఈ సినిమా ఫ్యామిలీ ఆడియన్స్ అండ్ యూత్ ఆడియన్స్ కి బాగా చేరువయింది. దీని తర్వాత నీ స్నేహం కూడా ఒక మోస్తారు హిట్ గా నిలిచింది. ఇక ఈ బ్యానర్ నుంచి వచ్చిన ఒక్కడు తిరుగు లేని విజయాన్ని అందుకుంది. సూపర్ స్టార్ మహేష్ బాబు కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్ అలాగే నిర్మాత, దర్శకుడికి భారీ సక్సెస్ ఇచ్చింది. తర్వాత వర్షం, నువ్వొస్తానంటే నేనొద్దంటానా సినిమాలతో హ్యాట్రిక్ హిట్స్ అందుకున్నారు.

M.S.RAJU : అదే దర్శకుడు ఎం.ఎస్.రాజుకి అవ్వాలనే కోరిక కలిగించింది.

ఎం.ఎస్.రాజుకి కథం స్క్రీన్ ప్లే మీద మంచి పట్టుంది. అదే ఆయనని సక్సెస్ రానప్పుడు దర్శకుడు అవ్వాలనే కోరిక కలిగించింది. వరుసగా ఫ్లాప్స్ వస్తుండటంతో ఆయనే దర్శకుడిగా మారాడు. వాన, తూనీగ తూనీగ సినిమాలు తెరకెక్కించారు. కానీ డైరెక్టర్‌గా ఫెయుల్ అయ్యారని కామెంట్స్ వచ్చాయి. అటు నిర్మాతగా ఇటు దర్శకుడిగా సక్సెస్ ట్రాక్ తప్పడంతో కొంత గ్యాప్ తీసుకున్న ఎం.ఎస్.రాజు డర్టీ హరి తీశారు. ఇది కూడా ఆయనకి పెద్దగా ఉపయోగపడలేదు. అయితే త్వరలో ఓ పెద్ద హీరో సినిమా నిర్మించేందుకు ప్లాన్ చేసుకుంటున్నట్టు తెలుస్తోంది. ఏదేమైనా దర్శకుడిగా మారడమే ఆయన చేసిన పెద్ద మిస్టేక్ అని చెప్పుకుంటున్నారు.

 

Stay on top of the game with the latest updates on Telugu latest news today! Experience the thrill of LIVE Telugu news updates like never before, only on Teluguonlinenews.com.

Mail

Published on జూన్ 7, 2021 at 1:42 సా.