Tapsee : దర్శకేంద్రుడు కె రాఘవేంద్ర రావు తెరకెక్కించిన ఝుమ్మంది నాదం సినిమాతో టాలీవుడ్‌కి పరిచయమయింది. మంచు మనోజ్ హీరోగా నటించిన ఈ సినిమా యావరేజ్ హిట్ గా నిలిచింది. తాప్సీకి మాత్రం మంచి పేరొచ్చింది. ఆ తర్వాత కూడా టాలీవుడ్‌లో ప్రభాస్, రవితేజ, వెంకటేశ్ లాంటి స్టార్స్ సరసన నటించి ఆకట్టుకుంది. కానీ టాలీవుడ్‌లో తాప్సి అందుకున్న సక్సెస్ లు చాలా తక్కువ. థ్రిల్లార్ సినిమాలలో కూడా నటించి ఆకట్టుకుంది. కానీ ఇక్కడ స్టార్ స్టేటస్ అందుకోవడంలో విఫలమయింది. దానికి తోడు తాప్సీ సెన్షేషనల్ కామెంట్స్ చేయడంతో టార్గెట్ అయిందనే మాట వినిపించింది.

is it because of this tapsee fade out in tollywood industry...?

బాలీవుడ్‌లో ఎంటరైన తాప్సీ జుడ్వా 2 లో గ్లామర్ రోల్ తో బీకిని షోతో అట్రాక్ట్ చేసింది. కానీ అక్కడ అతికొద్ది కాలంలోనే మంచి పర్ఫార్మెన్స్ కి స్కోప్ ఉన్న క్యారెక్టర్ చేసే అవకాశాలు అందుకుంది. ముఖ్యంగా తాప్సీ కి బిగ్ బి అమితాబ్ బచ్చన్ తో కలిసి నటించిన పింక్, బద్లా వంటి సినిమాలు తాప్సీ క్రేజ్ ని విపరీతంగా పెరిగేలా చేశాయి. పింక్ టాలీవుడ్ లో, కోలీవుడ్ లో రీమేక్ అయినా తాప్సీ గురించే ఎక్కువగా మాట్లాడుకున్నారు. అంతగా ఆకట్టుకుంది. నాం షబానా, మిషన్ మంగళ్ లాంటి క్రేజీ ప్రాజెక్ట్ తాప్సీ రేంజ్ ని మరింతగా పెంచాయి.

Tapsee : తాప్సీ ఇవన్ని లైట్ తీసుకుంది.

అయితే బాలీవుడ్ కంటే టాలీవుడ్ వాళ్ళు హీరోయిన్ ని చూపించే విధానం చాలా డిఫ్రెంట్ గా ఉంటుందని కామెంట్స్ చేసింది. అంతేకాదు తన మొదటి సినిమాలో బొడ్డుమీద కొబ్బరి కాయలు వేయాల్సిన అవసరం ఏంటో నాకు ఇప్పటికీ అర్థం కాలేదని దర్శకేంద్రుడు మీదే కామెంట్స్ చేసింది. ఇది తాప్సీకి బాగా ఇబ్బందులు తెచ్చిపెట్టింది. ఒకరకంగా టాలీవుడ్ లో పూర్తిగా అవకాశాలు తగ్గడానికి ఇదే మెయిన్ రీజన్ అయిందని చెప్పుకున్నారు. కానీ తాప్సీ ఇవన్ని లైట్ తీసుకుంది. బాలీవుడ్ లో తన సత్తా చాటుతూ స్టార్ గా ఓ వెలుగు వెలుగుతోంది.

Stay on top of the game with the latest updates on Telugu latest news today! Experience the thrill of LIVE Telugu news updates like never before, only on Teluguonlinenews.com.

Mail

Published on జూన్ 12, 2021 at 11:53 ఉద.