Nani : నాని..నేచురల్ స్టార్‌గా ఎంతటి క్రేజ్ ఉన్న హీరోనో అందరికీ తెలిసిందే. నాని నిర్మాతల హీరో అని ఇండస్ట్రీలో అందరూ చెప్పుకుంటుంటారు. అందుకు కారణం నాని సినిమా వల్ల ఎప్పుడు నిర్మాత భారీగా నష్టాలు చూసింది లేదు. అందుకే నాని వరసగా సినిమాలు చేస్తూ వస్తున్నాడు. అయితే గత కొంత కాలంగా నాని సినిమాలు బాక్సాఫీస్ వద్ద అనుకున్నంతగా సక్సస్ కావడం లేదు. తాజాగా నాని నటించిన సినిమా టక్ జగదీష్ సినిమా. నానికి ‘నిన్ను కోరి’ సినిమాతో మంచి సక్సెస్ ఇచ్చిన దర్శకుడు శివ నిర్వాణ.

is-it-going-to-become-minus-for-nani-movie
is-it-going-to-become-minus-for-nani-movie

నానికి డెబ్యూ సినిమా కావడంతో మంచి ఫ్యామిలీ ఎమోషనల్ డ్రామాగా తెరకెక్కించి హిట్ అందుకున్నాడు. ఆ తర్వాత నాగ చైతన్య, సమంతలతో తెరకెక్కించిన మజిలీ కూడా ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ గానే తెరకెక్కించి మరో హిట్ తన ఖాతాలో వేసుకున్నాడు. ఇప్పుడు నాని – శివ నిర్వాణ కాంబినేషన్ లో రూపొంది రాబోతున్న సినిమా టక్ జగదీష్. ఈ సినిమాని కూడా కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా తెరకెక్కించాడు శివ నిర్వాణ. ఇక ఈ సినిమాలో నానికి అన్నయ్యగా జగపతిబాబు నటిస్తుండగా.. రీతూ వర్మ, ఐశ్వర్యా రాజేశ్ హీరోయిన్స్ గా నటించారు.

Nani : టక్ జగదీష్ లో ఐటెం సాంగ్ అంటే మైనస్ అవుతుందేమో..?

అయితే ఈ సినిమా కరోనా సెకండ్ వేవ్ కారణంగా పోస్ట్ పోన్ చేయగా ..ఓటీటీలో రిలీజ్ చేస్తారన్న రూమర్స్ క్రియేటయ్యాయి. వాస్తవంగా అయితే ఈ నెల 23న రిలీజ్ కావాల్సింది. కాని పోస్ట్ పోన్ చేస్తూ ప్రకటన వదిలారు. మళ్ళీ టక్ జగదీష్ ఎప్పుడు రిలీజ్ చేస్తారో వెల్లడించలేదు. అయితే ఈ సినిమాలో ఐటెం సాంగ్ పెట్టాలనుకుంటున్నట్టు వార్తలు వస్తున్నాయి. శివ నిర్వాణ తెరకెక్కించిన నిన్నుకోరి, మజిలీ సినిమాలలో ఇలాంటి ఐటెం సాంగ్ లేదు. అలాంటిది ఇప్పుడు టక్ జగదీష్ లో ఐటెం సాంగ్ అంటే మైనస్ అవుతుందేమో అని మాట్లాడుకుంటున్నారట. చూడాలి మరి ఏం జరుగుతోంది.

Stay on top of the game with the latest updates on Telugu latest news today! Experience the thrill of LIVE Telugu news updates like never before, only on Teluguonlinenews.com.

Mail

Published on ఏప్రిల్ 26, 2021 at 10:47 ఉద.