YCP: ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ ఎన్నికలు ఏపీ రాజకీయాలను కీలక మలుపుతిప్పాయి. పంచపర్తి అనురాధ వైసీపీలో ప్రకంపనలు సృష్టించింది. టీడీపీకి అమ్ముడు పోయిన ఆనం రామనారాయణ రెడ్డి, కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి, ఉండవల్లి శ్రీదేవి, మేకపాటి చంద్రశేఖర్ లను సస్పెండ్ చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. అయితే ఈ నాయకులు ఎప్పటికైనా తమకు హ్యాండ్ ఇస్తారని వైసీపీ పెద్దలకు ముందే తెలిసినట్టుందని, ఈ సస్పెండ్ పై వాళ్ళు స్పందిస్తున్న తీరును చూస్తే అర్థమైతుంది. ఈ నాయకులపై ముందు నుండే అనుమానం ఉంటే ఇప్పటి వరకు వాళ్ళను పార్టీలోకి ఎందుకు పెట్టుకున్నారన్న ప్రశ్నలు రాజకీయ వర్గాల నుండి వస్తున్నాయి. అనుమానం వచ్చినప్పుడే వారిపైచర్యలు తీసుకోని ఉంటె, ఇప్పుడు వైసీపీకి ఈ కష్టాలు వచ్చేవి కాదని వైసీపీ కార్యకర్తలు చెప్తున్నారు.

వాళ్లకు వైసీపీపై ప్రేమ లేదు!!
సస్పెండ్ ఐన ఎమ్మెల్యేలు కూడా వైసీపీ తమను ఎదో ఒకరోజు పార్టీ నుండి గెంటేస్తుందని, ముందే ఉహించినట్టున్నారు. ఎందుకంటే వాళ్ళు కూడా సస్పెండ్ అయిన తరువాత షాక్ అవ్వకుండా చాల ప్రశాంతంగా రియాక్ట్ అవున్నారు. తామే ఎప్పుడో ఒకప్పుడు పార్టీ నుండి వెళ్లిపోయేవాళ్ళం, పార్టీనే పంపించిందని సంతోషపడుతున్నారు. సస్పెండ్ అయిన ఎమ్మెల్యే కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ… ఈ విషయం తానూ మూడు నెలల ముందే ఊహించానని, అయితే ఇలా ఇష్టమొచ్చినట్టు కాకుండా తన వెర్షన్ కూడా విని నిర్ణయం తీసుకోని ఉండి, ఉంటె బాగుండేదని కోటంరెడ్డి అన్నారు. అలాగే మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి కూడా మీడియా ముందుకు వచ్చి మాట్లాడుతూ… పార్టీలో ఇన్నాళ్లు ఉన్నందుకు చాలామంచి మర్యాద చేశారని, పార్టీ నుండి బటయకు వచ్చిన్నందుకు చాల రిలాక్స్ గా ఫీల్ అవుతున్నానని, తన నియోజకవర్గాన్ని వైసీపీ ప్రభుత్వం బ్రష్టుపట్టించిందని, కావాలంటే ఇప్పుడే రాజీనామా చేసి, మళ్లీ ఎన్నికలకు సిద్ధమని ప్రకటించారు. ఇలా ఈ సస్పెండ్ అయినా నేతలకు కూడా ముందే తెలుసు తామను పార్టీ ఎదో ఒక రోజు ఇలా సస్పెండ్ చేస్తుందని, అందుకే ఇలా కరెక్ట్ టైం చూసుకొని, వైసీపీకి షాక్ ఇచ్చారు .
వాళ్ళు పారిపోతున్నారు
ఉండవల్లి శ్రీదేవి మాత్రం ఈ విషయం బయటకు వచ్చినప్పటి నుండి కనీసం ఎవ్వరికి కన్పించకుండా తిరుగుతున్నారు. ఆమె దొరుకుతానని అనుకోలేదా లేకపోతే దొరికినా తనని తన వాళ్ళు సపోర్ట్ చేస్తారని అనుకోని, ఇప్పుడు వాళ్ళు ఎదురు తిరుగుతుండటంతో ఇలా భయపడిపారిపోతున్నారో అర్థం కావడం లేదు. అలాగే ఆనం రామనారాయణ రెడ్డి కూడా ఈ విషయం తెలిసిన తరవాత మీడియా ముందుకు రావడం లేదు. ఎందుకంటే అయన కూడా ఈ సస్పెన్షన్ ను ఊహించునట్టు లేదని రాజకీయ వర్గాలు చెప్తున్నాయి. వీళ్ళు మీడియా ముందుకు వచ్చి ఏమి చెప్తారో వేచి చూడాలి.