Jagan: వచ్చే ఎన్నికల్లో ఎవరికీ అధికారం దక్కించుకోవడానికి వైసీపీ, టీడీపీ, జనసేన నాయకులు తెగ పోటీ పడుతున్నారు. ప్రజల్లో ఎవరి క్రేజ్ ఎంతుందో తెలుసుకోవడానికి ఎప్పటికప్పుడు ఈ నాయకులు సర్వేలు చేయిస్తునే ఉన్నారు. ఆ ఫలితాలను బట్టి వ్యూహాలు మారుస్తూ ఉంటారు. ఆ సర్వేలు ఒక్కోసారి కరెక్ట్ గా ఉండొచ్చు లేదా తప్పుగా కూడా ఉండొచ్చూ. అయితే ఇప్పుడు ఏపీలో ఎవరిపై ప్రజల్లో నమ్మకం ఉందొ లేదా ఎవరి పాలన ప్రజలు కోరుకుంటున్నారో అనే దానికి సూచికగా ఎమ్మెల్సీ ఎన్నికలు వచ్చాయి. ఈ ఎన్నికల్లో వచ్చిన ఫలితాలను చూస్తూ, వైసీపీ, టీడీపీ నాయకులు తమ భవిష్యత్ వ్యూహాలను రచిస్తున్నారు. ఈ ఎన్నికల్లో వైసీపీ గ్రాడ్యుయేట్స్ చాల పెద్ద షాక్ ఇచ్చారు. వైసీపీ మొత్తానికి టీడీపీని చిత్తూ చేస్తుందేమోనని అంతా అనుకున్నారు కానీ టీడీపీనే వైసీపీకి షాక్ ఇచ్చింది. నిజానికి రాష్ట్ర యువత వైసీపీకి షాక్ ఇచ్చారని చెప్పాలి.

వైసీపీ భయపడింది
ఎందుకంటే తమ పాలన బాగుందని, రాష్ట్ర ప్రజలంతా తమ వైపు ఉన్నారని, ఎప్పుడు ఎన్నికలు వచ్చినా, ఎంతమంది కలిసి ఎన్నికలకు వచ్చినా కూడా వైసీపీదే విజయమని వైసీపీ ధీమా వ్యక్తం చేస్తూ ఉండేవాళ్ళు కానీ ఈ ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలు చూసి, వైసీపీ నాయకుల్లో భయం మోడలింది. విశాఖ రాజధాని నిర్ణయంతో ఉత్తరాంధ్రలో టీడీపీ పూర్తిగా ఆత్మరక్షణలో పడిందని వైసీపీ అంచనాలతో ఉంది. అదే విధంగా రాయలసీమలో సామాజిక సమీకరణాలతో వైసీపీ ఏకపక్షంగా నిలుస్తోందనే అభిప్రాయం తో ఉంది. కానీ, పట్టభద్రులు మాత్రం టీడీపీ వైపే నిలిచారు. వైసీపీ కంచుకోటల్లో టీడీపీ బలం పెరగటం తో వైసీపీ ఎన్నికల వేళ తమ బలహీనతలను సమీక్షించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది.
టీడీపీ ఇదే ఊపును కొనసాగిస్తుందా!!
ఈ ఎమ్మెల్సీ ఎన్నికల్లో వచ్చిన విజయం టీడీపీ నాయకుల్లో,కార్యకర్తల్లో చాలా ఉత్సాహానిచ్చింది. ఎందుకంటే గత ఎన్నికల్లో టీడీపీ వచ్చిన ఫలితాన్ని టీడీపీ వాళ్ళే షాక్ అయ్యారు, ఆ షాక్ నుండి తెలుకోవడానికే టీడీపీ నాయకులకు చాల సమయం పట్టింది. దాంతో ప్రజల్లో తీవ్రమైన వ్యతిరేకత ఉందని టీడీపీఅర్థమైంది. కానీ ఇప్పుడు వ్యతిరేకతను తీసుసుకొని, మళ్ళీ అధికారం కోసం చేస్తున్న ప్రయత్నానికి, వైసీపీ చేస్తున్న తప్పులను చెప్తున్నా విధానానికి ప్రజలు కనెక్ట్ అవుతున్నారన్న దానికి ఇదో సంకేతం. ఈ ఎన్నికల్లో వచ్చిన ఊపును ఇలాగ కొనసాగిస్తే వచ్చే ఎన్నికల్లో వైసీపీ గట్టి పోటీ ఇచ్చేలానే ఉంది.