Prabhas : పాన్ ఇండియన్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న భారీ యాక్షన్ ఎంటర్‌టైనర్ సలార్. మూడేళ్ళ తర్వాత క్రాక్ సినిమాతో ఫాంలోకి వచ్చిన శృతిహాసన్ హీరోయిన్‌గా నటిస్తోంది. కేజీఎఫ్ చిత్రాల దర్శకుడు ప్రశాంత్ నీల్ ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్నాడు. ఈ సినిమాను కేజీఎఫ్ ప్రొడ్యూసర్ విజయ్ కిరగందుర్ నిర్మిస్తున్నాడు. బాహుబలి తర్వాత మళ్ళీ అంతకు మించిన రేంజ్‌లో సలార్‌లో ప్రభాస్ క్యారెక్టర్ ఉంటుందని ప్రచారం జరుగుతోంది. ఇక ఈ సినిమా మొదలైనప్పటి నుంచి రూమర్స్ విపరీతంగా వచ్చి సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

ప్రభాస్ ఇందులో తండ్రీ కొడులుగా డ్యూయల్ రోల్‌లో కనిపించబోతున్నాడని గత కొన్ని రోజులుగా వార్తలు వస్తున్నాయి. అలాగే ఇందులో శివగామి రమ్యకృష్ణ ప్రభాస్ సిస్టర్ పాత్రలో కనిపించబోతుందని ఇన్ని రోజులు వార్తలు వచ్చాయి. తాజాగా కోలీవుడ్ స్టార్ హీరో సూర్య సతీమణి.. హీరోయిన్ జ్యోతిక ప్రభాస్‌కు సిస్టర్ పాత్రలో కనిపించబోతుందని సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. తెలుగుతో పాటు ఇతర భాషల్లో జ్యోతిక కన్నడ భాషలో ప్రియాంక త్రివేదిని నటింప చేయాలని చూస్తున్నారట.
Prabhas : ప్రభాస్ రాధే శ్యాం తో పాటు ఆది పురుష్ సినిమాలను పూర్తి చేసే పనిలో ఉన్నాడు.
త్వరలో ఇందుకు సంబంధిచిన అఫీషియల్ కన్‌ఫర్మేషన్ రానుందని తెలుస్తోంది. ఒకవేళ నిజంగానే జ్యోతిక గనక సలార్‌లో నటించేది కన్‌ఫర్మ్ అయితే ప్రాజెక్ట్‌కు భారీ స్థాయిలో క్రేజ్ రావడం గ్యారెంటీ అంటున్నారు. ఈ సినిమా వచ్చే ఏడాది ఏప్రిల్ 14న రిలీజ్ చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. రాధే శ్యాం తో పాటు ఆది పురుష్ సినిమాలను పూర్తి చేసే పనిలో ఉన్నాడు ప్రభాస్. ప్రస్తుతం హైదరాబాద్ రామోజీ ఫిల్ సిటీలో ఆదిపురుష్ కోసం భారీ సెట్ నిర్మించారు. కరోనా సెకండ్ వేవ్ కారణంగా షూటింగ్ ఆగిపోయింది.