Kamalini: ఒకప్పుడు హీరోయిన్ గా రాణించిన కొంతమంది నటీమణులు వయసు మీద పడటం, అలాగే ఇప్పుడున్న పరిస్థితులకు అనుగుణంగా అప్గ్రేడ్ అవ్వకపోవడం వంటి కారణాలతో ఫేడ్ అవుట్ అయినటువంటి నటిమణులు ఇండస్ట్రీలో చాలామంది ఉన్నారని చెప్పవచ్చు. దీంతో కొందరు పెళ్లి చేసుకుని సెటిల్ అయితే, మరికొందరు మాత్రం వ్యాపారాలు, విదేశాలు, అంటూ ఇతర రంగాలను సెటిల్ అయ్యారు. అయితే ఒకప్పుడు హ్యాపీ డేస్, ఆనంద్ మంచి కాఫీలాంటి సినిమా, గోదావరి అలాగే మరిన్ని హిట్ చిత్రాలలో నటించిన ప్రముఖ బ్యూటిఫుల్ హీరోయిన్ కమిలిని ముఖర్జీ ఇప్పటి తరం ప్రేక్షకులకు పెద్దగా గుర్తు ఉండకపోవచ్చు కానీ 90s ఆడియన్స్ కు మాత్రం బాగానే గుర్తుంటుంది.
అయితే నటి కమిలిని ముఖర్జీ స్వతహాగా తెలుగు రాష్ట్రాలకు చెందిన నటి కాకపోయినప్పటికీ టాలీవుడ్ లో అవకాశాలు దక్కించుకొని ఇక్కడ ప్రేక్షకులను బాగానే అలరించింది. అంతేకాకుండా తమిళం, మలయాళం, తదితర భాషలలో కూడా కనిపించి అక్కడ కూడా తనకంటూ కొంతమంది అభిమానులను సంపాదించుకుంది. అయితే నటి కమిలిని ముఖర్జీకి హీరోయిన్ గా అవకాశాలు తగ్గిన తర్వాత కొంతకాలం పాటు సినిమాలకి బ్రేక్ ఇచ్చి తన కుటుంబ సభ్యులతో కలిసి లైఫ్ ని ఆస్వాదించింది.
అయితే తాజా సమాచారం ప్రకారం నటి కమిలిని ముఖర్జీ వ్యాపార రంగంలోకి అడుగుపెట్టినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో ఫుడ్ బిజినెస్ లోకి ఎంటర్ అయ్యి ఏకంగా సొంతంగా ఓ బేకరీ ని కూడా స్టార్ట్ చేసిందట. అయితే ఈ బేకరీలో స్పెషల్ అకేషన్స్ కి సంబంధించిన ఫుడ్ ఐటమ్స్ బాగా ఫేమస్ అట. అయితే ఫుడ్ బిజినెస్ లో మంచి ప్రాఫిట్స్ తో పాటు సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ కూడా ఎక్కువగా ఉంటుందని అందుకే కమ్యూనిటీ ముఖర్జీ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
ఈ విషయం ఇలా ఉండగా చివరగా నటి కమిలిని ముఖర్జీ తెలుగులో ప్రముఖ హీరో రామ్ చరణ్ తేజ్ హీరోగా నటించిన గోవిందుడు అందరివాడే చిత్రంలో ప్రముఖ హీరో శ్రీకాంత్ కి జోడిగా కనిపించింది. ఆ తర్వాత మలయాళం లో ప్రముఖ స్టార్ హీరో మోహన్ లాల్ హీరోగా నటించిన మణ్యం పులి (తెలుగు, తమిళం, మలయాళం) చిత్రంలో నటించింది. ఈ చిత్రం మంచి హిట్ అయినప్పటికీ కమిలిని ముఖర్జీకి పెద్దగా ఆఫర్లను తెచ్చి పెట్టలేక పోయింది అందుకే సినిమాలకు స్వస్తి పలికినట్లు తెలుస్తోంది.