Anushka shetty : ఇండస్ట్రీలో 15 ఏళ్ళ లాంగ్ జర్నీలో అనుష్క శెట్టి ఎన్నో బ్లాక్ బస్టర్స్ అందుకుంది. టాలీవుడ్ లో సూపర్ సినిమాతో ఎంట్రీ ఇచ్చింది. ధూమ్ లాంటి కాన్సెప్ట్‌తో పూర్ జగన్నాథ్ తెరకెక్కించిన ఈ సినిమాలో నాగార్జున, సోనూసూద్‌లతో పోటీగా నటించింది. ముఖ్యంగా బైక్ రైడింగ్ సీన్స్‌లో అదరగొట్టింది. ఇంత హైట్ ఉన్న హీరోయిన్ హీరోలకి సెట్ అవుతుందని కొన్ని నెగిటివ్ కామెంట్స్ కూడా వినిపించాయి. కానీ రాను రాను అనుష్క డేట్స్ దొరకడం కూడా కష్టంగా మారింది. నాగార్జున, వెంకటేశ్, బాలకృష్ణ, ప్రభాస్, అల్లు అర్జున్ – మంచు మనోజ్, గోపీచంద్ లాంటి వారితో కలిసి నటించింది. మెగాస్టార్ సినిమాలలో గెస్ట్ అపీరియన్స్ ఇచ్చింది.

is keerthy suresh repeating the same mistake as anushka-shetty-

ఎక్కువగా టాలీవుడ్ లో నాగార్జున సినిమాలు చేసి హిట్ అందుకుంది. ఇక ప్రభాస్, గోపీచంద్ తన హైట్‌కి సెట్ అయిన హీరోలని చెప్పిన సందర్భాలున్నాయి. కానీ అరుంధతి సినిమాతో వచ్చిన క్రేజ్ అంతా ఇంతా కాదు. ఈ సినిమా అనుష్క కెరీర్ కి చాలా ప్రత్యేకం. అయితే ఆ తర్వాత లేడీ ఓరియెంటెడ్ సినిమాలంటూ..వాటి కోసం ప్రయోగాలు చేసి పెద్ద పొరపాటు చేసింది. సైజ్ జీరో సినిమా అనుష్క కెరీర్ దెబ్బ తినడానికి ఓ కారణం అని అభిమానులే చెప్పుకున్న సందర్భాలు ఉన్నాయి. కానీ అనుష్క కథ నచ్చితే తనని తాను ఎలా మార్చుకోవడానికైనా వెనకాడదని చెప్పడానికి ఈ సినిమానే ఉదాహరణ.

Anushka shetty : అనుష్క మాదిరిగా కీర్తి కూడా కొన్ని కామన్ మిస్టేక్స్ చేసిందని చెప్పుకుంటున్నారు.

అయితే తనలాగానే మహానటి తర్వాత కీర్తి కూడా లేడీ ఓరియెంటెడ్ సినిమాలు కమిటయింది. అయితే మహానటి సమయంలో బాగా లావెక్కిందన్న కామెంట్స్ తో సన్నబడాలని ట్రై చేసి అనుకున్నది సాధించింది. కానీ మరీ బక్క చిక్కి చూడటానికే ఇష్టపడనంతగా తయారైంది కీర్తి. ఇదే సమయంలో వరుసగా లేడీ ఓరియెంటెడ్ సినిమాలని పెంగ్విన్, మిస్ ఇండియా, గుడ్ లక్ సఖీ సినిమాలు ఒప్పుకోవడం పెద్ద రాంగ్ స్టెప్. ఇప్పటికే పెంగ్విన్, మిస్ ఇండియా వచ్చి ఫ్లాప్ని మూటగట్టుకున్నాయి. నితిన్ తో నటించిన రంగ్ దే కూడా కీర్తికి పెద్దగా కలిసి రాలేదు. అందుకే అనుష్క మాదిరిగా కీర్తి కూడా కొన్ని కామన్ మిస్టేక్స్ చేసిందని చెప్పుకుంటున్నారు.

Stay on top of the game with the latest updates on Telugu latest news today! Experience the thrill of LIVE Telugu news updates like never before, only on Teluguonlinenews.com.

Mail

Published on జూన్ 14, 2021 at 1:01 సా.