Trivikram : త్రివిక్రమ్ శ్రీనివాస్ – సూపర్ స్టార్ మహేష్ బాబు కాంబినేషన్ లో ఒక సినిమా ఇటీవలే ప్రకటించిన సంగతి తెలిసిందే. దాదాపు 11 ఏళ్ళ తర్వాత ఈ ఇద్దరి కాంబినేషన్ లో సినిమా రాబోతుండంతో ప్రకటన వచ్చినప్పటి నుంచే భారీగా అంచనాలు మొదలయ్యాయి. అదీకాక ఈ సినిమా హ్యాట్రిక్ కావడం కూడా ప్రత్యేకతను సంతరించుకుంది. ఇక ఈ సినిమా ప్రకటించినప్పటి నుంచి అటు ఇండస్ట్రీ వర్గాలలో ఇటు సోషల్ మీడియాలో ఆసక్తికరమైన చర్చలు మొదలయ్యాయి. ఎలాంటి కథలో మహేష్ నటించబోతున్నాడనే దగ్గర్నుంచి హీరోయిన్స్ వరకు ఒకటే చర్చలు సాగుతున్నాయి.

is kiyara, pooja in trivikram-mahesh movie...?
is-kiyara-pooja-in-trivikram-mahesh-movie

అయితే తాజాగా వినిపిస్తున్న టాక్ ప్రకారం త్రివిక్రమ్ రాసిన కథలో ఇద్దరు హీరోయిన్స్‌కు అవకాశం ఉందని తెలుస్తోంది. ఆ ఇద్దరిని స్టార్ హీరోయిన్స్‌నే తీసుకునే ఆలోచనలో చిత్ర బృందం ఉన్నారట. ప్రముఖంగా వినిపిస్తున్న ఆ ఇద్దరు హీరోయిన్స్..పొడుగు కాళ్ళ సుందరి మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ పూజా హెగ్డే, భరత్ అనే నేను సినిమాతో టాలీవుడ్‌లో ఎంట్రీ ఇచ్చిన కియారా అద్వానీ. ప్రస్తుతం కియారా బాలీవుడ్‌లో బిజీ హీరోయిన్ గా వెలుగుతోంది. తెలుగులో రెండు సినిమాలు చేసిన ఈమె మళ్ళీ ఇటు వైపు వచ్చే సమయం దొరకడం లేదు.

Trivikram : త్రివిక్రమ్ తెరకెక్కించబోతున్న ఇందులో సాయీ మంజ్రేకర్ పేరు కూడా ప్రచారంలో నిలుస్తోంది.

ఇక పాన్ ఇండియన్ కథాంశంతో త్రివిక్రమ్ తెరకెక్కించబోతున్న ఇందులో ఇటు సౌత్ అటు నార్త్ సినిమా ఇండస్ట్రీలలో స్టార్ హీరోయిన్స్‌ను తీసుకోవాలనే వీరి పేర్లు పరిశీలిస్తున్నట్టు తెలుస్తోంది. ఇక సాయీ మంజ్రేకర్ పేరు కూడా ప్రచారంలో నిలుస్తోంది. ఈమె ప్రస్తుతం మహేష్ నిర్మాతగా రూపొందుతున్న మేజర్, వరుణ్ తేజ్ సరసన గని సినిమాలు చేస్తోంది. కాగా మహేష్ ప్రస్తుతం సర్కారు వారి పాట సినిమాలో నటిస్తున్నాడు. కీర్తి సురేష్ హీరోయిన్‌గా తెరకెక్కుతున్న ఈ సినిమాను పరశురాం డైరెక్ట్ చేస్తున్నాడు.

Stay on top of the game with the latest updates on Telugu latest news today! Experience the thrill of LIVE Telugu news updates like never before, only on Teluguonlinenews.com.

Mail

Published on మే 18, 2021 at 8:32 ఉద.