Prabhas : ప్రభాస్ నటిస్తున్న పాన్ ఇండియన్ సినిమాలలో రాధే శ్యామ్ ఒకటి. యంగ్ డైరెక్టర్ జిల్ ఫేమ్ రాధకృష్ణ తెరకెక్కిస్తున్నాడు. పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తోంది. గోపీకృష్ణ మూవీస్ – కృష్ణంరాజు, టీ సిరీస్ – భూషణ్ కుమార్ సమర్పణలో యూవీ క్రియేషన్స్ బ్యానర్‌పై వంశీ – ప్రమోద్ – ప్రసీద దాదాపు 250 కోట్ల భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. కేవలం వారం రోజుల షూటింగ్ మినహా సినిమా మొత్తం రెడీగా ఉంది. మరో నెలలో థియేటర్స్ 100 పర్సెంట్ ఆక్యుపెన్సీతో ఓపెన్ అయినా రిలీజ్ చేసేలా ఉన్నారు.

is krishnam raju becomes plus or minus for prabhas radhae shyam
is krishnam raju becomes plus or minus for prabhas radhae shyam

1960 కాలం నాటి పీరియాడికల్ రొమాంటిక్ లవ్ స్టోరిగా ఈ సినిమా తెరకెక్కుతోంది. ఓ పెద్ద కార్ల కంపెనీకి ఓనర్ గా ప్రభాస్ నటిస్తుండగా ఓ హాస్పిటల్ లో నర్స్ పాత్రలో పూజా హెగ్డే కనిపించబోతుందట. ఇక ఈ సినిమాలో అలనాటి బాలీవుడ్ స్టార్ హీరోయిన్ భాగ్యశ్రీ కీలక పాత్రలో నటిస్తున్నారు. అంతేకాదు హీరోయిన్ గా ఉన్నప్పుడు తెలుగులో చేయాలనుకున్నారు. కానీ సాధ్యపడలేదు. ఇన్ని ఏళ్ళకి రాధే శ్యాం సినిమాతో ఆ కోరిక నెరవేరుతోంది. ప్రభాస్ – భాగ్యశ్రీల మీద కీలక సన్నివేశాలు ఉన్నాయట.

Prabhas : కృష్ణంరాజు ఈ సినిమాలో ఓ ముఖ్య పాత్ర పోషిస్తున్నారు.

అలాగే చాలాకాలం తర్వాత ప్రభాస్ పెదనాన్న కృష్ణంరాజు ఈ సినిమాలో ఓ ముఖ్య పాత్ర పోషిస్తున్నారు. ఇద్దరి మధ్య సీన్స్ కూడా ఉంటాయి. అయితే ఇక్కడే అభిమానులు ఓ సెంటిమెంట్ గురించి కంగారు పడుతున్నారు. ప్రభాస్ సినిమాలో కృష్ణంరాజు నటించినవన్ని హిట్ అవలేదు. అదే ఇప్పుడు రాధే శ్యామ్ కి రిపీట్ అవుతుందేమో అని చర్చించుకుంటున్నారట. చూడాలి మరి ఈ బ్యాడ్ సెంటిమెంట్ ఇప్పటికైనా బ్రేక్ అవుతుందో లేదే. కాగా ఈ సినిమాలో ప్రభాస్ విక్రమాదిత్యగా, పూజా హెగ్డే ప్రేరణగా కనిపించబోతున్నారు.

Stay on top of the game with the latest updates on Telugu latest news today! Experience the thrill of LIVE Telugu news updates like never before, only on Teluguonlinenews.com.

Mail

Published on జూన్ 18, 2021 at 7:49 సా.