Vivah : బాలీవుడ్‌లో బ్లాక్ బస్టర్ అయిన సినిమా వివాహ్. సూరజ్ బర్జాత్య దర్శకత్వంలో షాహిద్ కపూర్, అమృత రావు జంటగా తెరకెక్కిన ఈ సినిమా 2006లో రిలీజై దేశ వ్యాప్తంగా అభిమానులను ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఈ సినిమాతో బాలీవుడ్‌లో షాహిద్ కపూర్ రేంజ్ కూడా విపరీతంగా పెరిగింది. కంప్లీట్ ఫ్యామిలీ కథాంశంతో రూపొందిన వివాహ్ మ్యూజికల్‌గానూ పెద్ద హిట్ సాధించింది. అయితే కొన్నేళ్ళుగా ఈ సినిమాను తెలుగులో రీమేక్ చేయాలని టాలీవుడ్ మేకర్స్ ట్రై చేశారు. కానీ వర్కౌట్ కాలేదు.

ఎట్టకేలకి ఇప్పుడు తెలుగులో రీమేక్ కాబోతోంది. ప్రముఖ నిర్మాత బెల్లంకొండ సురేష్ రెండో కుమారుడు బెల్లంకొండ గణేష్ హీరోగా ఎంట్రీ ఇచ్చేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. గత కొన్ని రోజులుగా మంచి కథ కోసం మేకర్స్ అన్వేషిస్తున్నారు. కానీ గణేష్ ఎంట్రికి సరైన కథ దొరకలేదు. దానికి తోడు కరోనా ఎఫెక్ట్ కూడా ఉండటంతో ప్రాజెక్ట్ డిలే అవుతూ వస్తోంది. ఈ నేపథ్యంలో వివాహ్ కథలో గణేష్ కనిపిస్తే ఎలా ఉంటుందన్న ఆలోచన రావడం..ఆయన ఎంట్రీ పర్‌ఫెక్ట్ కథ అని తెలుగు రైట్స్ కొనేశారు.
Vivah : వివాహ్ తెలుగు రీమేక్‌లో ఉప్పెన ఫేం కృతిశెట్టి నటించడం దాదాపు కన్‌ఫర్మ్
త్వరలో ఇందుకు సంబంధించిన అధికారక ప్రకటన రానున్నట్టు సమాచారం. ఇక గణేష్‌కు జంటగా వివాహ్ తెలుగు రీమేక్‌లో ఉప్పెన ఫేం కృతిశెట్టి నటించడం దాదాపు కన్‌ఫర్మ్ అయిందని తెలుస్తోంది. ఈ యంగ్ బ్యూటీ చేతిలో ఇప్పటికే అరడజను సినిమాలున్నాయి. వాటిలో ఈ ప్రాజెక్ట్ ఉందా లేక ఇది మరో కొత్త ప్రాజెక్టా అనేది తెలియదు గానీ .. కృతిశెట్టికి మాత్రం ఇది మంచి సినిమా అవుతుందంటున్నారు. కాగా బెల్లంకొండ శ్రీనివాస్ బాలీవుడ్ ఎంట్రీ తెలుగు బ్లాక్ బస్టర్ ఛత్రపతి సినిమాతో జరగబోతోంది. వి వి వినాయక్ దర్శకత్వం వహిస్తున్నాడు.