Bhola Shankar: మెగాస్టార్ చిరంజీవి సీన్ చేసినా రొమాంటిక్ సాంగ్ చేసినా..యాక్షన్ సీక్వెన్స్ చేసినా ఆ స్టైల్ గానీ మేనరిజం గానీ మరో హీరో కాస్త కూడా ఇమిటేట్ చేయలేడనే విషయం ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఇక సిల్వర్ స్క్రీన్ మీద చిరు కామెడీ టైమింగ్ మామూలుగా ఉండదు. బావగారూ బాగున్నారా, గ్యాంగ్ లీడర్, రౌడీ అల్లుడు, ఇంద్ర లాంటి సినిమాలలో మెగాస్టార్ పర్ఫార్మెన్స్ గురించి చెప్పడానికి కొన్ని ఎగ్జాంపుల్స్ మాత్రమే. ఇక 149 సినిమాలు చేసిన మెగాస్టార్ దాదాపు 10 ఏళ్ళు సినిమాలకు దూరంగా ఉన్నారు.
మళ్ళీ 150వ సినిమా ఖైదీ నంబర్ 150తో రీ ఎంట్రీ ఇచ్చిన చిరు అదే సత్తా చూపారు. సైరా సినిమాతో పాన్ ఇండియన్ మూవీని టచ్ చేశారు. ఈ క్రమంలో మెగాస్టార్ బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఈ నెల 29న ఆచార్య సినిమా వస్తోంది. దీని కోసం అభిమానులందరూ ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కూడా మరోగా నటిస్తున్న ఈ మెగా మల్టీస్టారర్ మీద భారీ అంచనాలున్నాయి. ఇక ఈ సినిమా రిలీజ్‌కు రెడీ అవుతుండగా మరో రెండు సినిమాలను ఇదే ఏడాది చిరు తీసుకు వచ్చేందుకు ప్లాన్ చేస్తున్నారు.

Bhola Shankar: రొమాంటిక్ డైలాగ్ కూడా లీకైంది.
ఇప్పటికే, గాడ్ ఫాదర్ సినిమా షూటింగ్ చివరి దశకు చేరుకోగా..భోళా శంకర్ సినిమా కూడా నాన్ స్టాప్‌గా షూటింగ్ జరుగుతుంది. తమన్నా హీరోయిన్గా, కీర్తి సురేశ్ చిరు చెల్లిగా నటిస్తున్నారు. ఇక బుల్లితెర పాపులర్ యాంకర్ ఇప్పటికే పలు హిట్ సినిమాలలో నటించి క్రేజ్ తెచ్చుకున్న శ్రీముఖి కూడా ఈ సినిమాలో నటిస్తుందట. అయితే, దర్శకుడు మెహర్ రమేశ్ పవన్ కళ్యాణ్ – భూమిక నటించిన ఇండస్ట్రీ హిట్ ఖుషి సినిమాలోని నడుము సీన్‌ను ఇన్స్పిరేషన్గా తీసుకొని భోళా శంకర్‌లో చిరు – శ్రీముఖిల మధ్య షూట్ చేశారట. ఈ సీన్ సూపర్బ్‌గా వచ్చిందని సమాచారం. అంతేకాదు, శ్రీముఖి మీరు “నా నడుమెందుకు చూశారు”.. అంటే దానికి మెగాస్టార్ అసలు నడుమెక్కడుందీ.. అంటూ ఇచ్చే రొమాంటిక్ డైలాగ్ కూడా లీకైంది. చూడాలు మరి ఖుషి సినిమాకే హైలెట్‌గా నిలిచిన ఈ నడుము సీన్ భోళా శంకర్‌లో ఎంత ఆకట్టుకుంటుందో.