M S Dhoni – Nayanatara: ఇండియన్ పాపులర్ క్రికెట్ క్రీడాకారుడు మహేంద్ర సింగ్ ధోని సినిమా రంగంలోకి అడుగుపెడుతున్నారు. ఇప్పటికే ఆయన తన పేరు మీద అంటే.. ధోని ఎంటర్ టైన్ మెంట్స్ ప్రయివేట్ లిమిటెడ్ పేరుతో కొత్త ప్రొడక్షన్స్ హౌజ్‌ను కూడా స్థాపించారు. ఈ సంస్థ ద్వారా మీడియం బడ్జెట్ నుంచి భారీ బడ్జెట్‌తో నిర్మించే పాన్ ఇండియన్ సినిమాల వరకు నిర్మించాలని ధోని ప్లాన్ చేస్తున్నాడు. ధోని, రిటైర్మెంట్ ప్రకటించిన తర్వాత పలు బిజినెస్‌లు ప్రారంభించారు. ఇప్పటికే రెస్టారెంట్ బిజినెస్, పౌల్ర్టీ వ్యాపారంలో భారీగా పెట్టుబడులు పెడుతున్నాడు.
ఈ క్రమంలోనే ఇప్పుడు ఇంటర్నేషనల్ లెవల్ స్టాండర్డ్స్ ఉన్న సినిమాలను నిర్మించ డానికి రెడీ అయ్యాడు. అయితే, ధోని నిర్మాణంలో రూపొందించబోయో మొదటి సినిమాను సౌత్ స్టార్ హీరోయిన్ నయనతారతో నిర్మించాలని ధోని సన్నాహాలు చేస్తున్నారని, దీనికి నయన్ భారీగా రెమ్యునరేషన్ కూడా అందుకుంటుందని ప్రచారం జరిగింది. అంతేకాదు, ఇదొక ఫీమేల్ సెంట్రిక్ మూవీ అని, కథ మొత్తం నయన్ చుట్టూనే తిరుగుతుందని వార్తలు వచ్చాయి.

M S Dhoni – Nayanatara: టీమ్ ఎగ్జైటింగ్ ప్రాజెక్ట్ పైన వర్క్ చేస్తోంది..
అయితే, తాజాగా ఈ వార్తలపై ధోని ఎంటర్ టైన్మెంట్ టీమ్ స్పందించింది. సోషల్ మీడియాలో వస్తున్న ఈ రూమర్స్‌ను దయచేసి నమ్మొద్దని తెలిపింది. ప్రస్తుతానికి తమ టీమ్ ఎగ్జైటింగ్ ప్రాజెక్ట్ పైన వర్క్ చేస్తోందని..అతి త్వరలోనే ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించిన పూర్తి వివరాలను వెల్లడిస్తామని క్లారిటీ ఇచ్చింది. అంతేకాదు, అప్పటి వరకూ ధోని సినిమాలకు సంబంధించి ఎలాంటి అసత్య ప్రచారం చేయవద్దంటూ సోషల్ మీడియా వారిని రిక్వెస్ట్ చేశారు. దాంతో ధోని నిర్మాతగా నయనతార సినిమా అనేది కేవలం పుకారే అని తేలిపోయింది.