Mamta: టాలీవుడ్ మరియు కోలీవుడ్ సినీ పరిశ్రమల్లో పలు చిత్రాల్లో హీరోయిన్గా నటించి ప్రేక్షకులను బాగానే అలరించినటువంటి ప్రముఖ బ్యూటిఫుల్ హీరోయిన్ మమతా మోహన్ దాస్ గురించి సినీ ప్రేక్షకులకు కొత్తగా తెలియజేయాల్సిన అవసరం లేదు. అలాగే నటి మమతా మోహన్ దాస్ కి నటిగా మాత్రమే కాకుండా మ్యూజిక్ రంగంలో కూడా తన గానంతో కుర్రకారుని కట్టిపడేసింది. అయితే మమత మోహన్ దాస్ అంటే పెద్దగా తెలియకపోవచ్చు, కానీ అప్పట్లో ఈ అమ్మడు పాడినటువంటి స్పెషల్ సాంగ్స్ కి మంచి రెస్పాన్స్ తో పాటు క్రేజ్ కూడా ఉండేది. అప్పట్లో శంకర్ దాదా జిందాబాద్ చిత్రంలో నటి మమతా మమతా మోహన్ దాస్ పాడిన ఆకలేస్తే అన్నం పెడతా అలసి వస్తే ఆయిల్ పెడతా అనే పాటకి ఇప్పటికీ యూట్యూబ్ లో మంచి క్రేజ్ ఉంది.
మల్టీ టాలెంటెడ్ స్కిల్స్ ఉన్నటువంటి నటి మమతా మోహన్ దాస్ ఈ మధ్యకాలంలో కొంతమేర సినీ పరిశ్రమకు దూరంగా ఉంటోంది. కాగా ఆ మధ్య అరుదైన క్యాన్సర్ బారిన పడినటువంటి మమతా మోహన్ దాస్ సినిమాలకి బ్రేక్ ఇచ్చి కొంతకాలం పాటు ట్రీట్మెంట్ తీసుకుంటూ క్యాన్సర్ని జయించింది. అయితే తాజాగా నటి మమత మోహన్ దాస్ బొల్లి మచ్చల సమస్యలు కూడా ఎదుర్కొంటున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ బొల్లి మచ్చల సమస్యను వెర్టిలిగో అని పిలుస్తారు. కాగా ఈ వ్యక్తిని కోసం మన శరీరంలోని మెలనో సైట్లు పనిసిరి దెబ్బతినడం వలన వస్తుందని వైద్య నిపుణులు చెబుతున్నారు. అలాగే మన చర్మపు రంగును నిర్ణయించేటువంటి ఈ మెలనో సైట్లు డ్యామేజ్ అవ్వడం కారణంగా శరీరంపై తెల్లటి లేదా నల్లటి మచ్చలు ఏర్పడడం ఈ మధ్యలో ఒక్కొక్కరికి గోధుమ రంగులో కూడా ఉంటాయట. దీంతో ఈ విషయం తెలుసుకున్న మమత అభిమానులు తొందరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నారు.
ఈ విషయం ఇలా ఉండగా నటి మమతా మోహన్ దాస్ నటన రంగంలో బాగానే రాణించినప్పటికీ తన వ్యక్తిగత జీవితంలో మాత్రం చాలా సమస్యలను ఎదుర్కొంది. ఈ క్రమంలో ప్రమాదకరమైన క్యాన్సర్ తో పాటు ప్రేమ పెళ్లి వంటి బంధాల కారణంగా కూడా సతమతమయింది. 2011వ సంవత్సరంలో ప్రజిత్ పద్మనాభన్ అనే బిజినెస్ మెన్ ప్రేమించి పెళ్లి వేసుకుంది. కానీ పెళ్లయిన మొదటి ఏడాదిలోనే వీరిద్దరి మధ్య మనస్పర్ధలు, విభేదాలు రావడంతో 2012 సంవత్సరంలో విడాకులు తీసుకున్నారు. కానీ అప్పటినుంచి నటి మమతా మోహన్ దాస్ మళ్లీ రెండో పెళ్లి చేసుకోలేదు.