Nayanatara : సినిమా ఇండస్ట్రీలో తెర మీద కలిసి నటించే హీరో, హీరోయిన్స్ ఎన్ని సార్లు ప్రేమలో పడతారో.. ఎన్నిసార్లు పెళ్ళి చేసుకుంటారో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఈ జంటలే బంధం బలపడి నిజ జీవితంలోనూ ఒక్కటవ్వాలనుకుంటారు. రీల్ లైఫ్ లో ప్రేమ జంటలే రియల్ లైఫ్ లోనూ ప్రేమించుకొని చెట్టా పట్టాలేసుకొని కొన్నాళ్ళు తిరుగుతారు. మీడియా కంట్లో పడ్డా కూడా మాది ప్రేమ కాదు ఫ్రెండ్ షిప్ అని చెప్పి తప్పించుకునే వాళ్ళు ఉన్నారు. అవును మేము ప్రేమలో ఉన్నాము.. త్వరలో గుడ్ న్యూస్ చెబుతాము అని చెప్పిన వాళ్ళు ఉన్నారు. కానీ ఏవో కారణాల వల్ల సడన్ గా మేము బ్రేకప్ చెప్పుకుంటున్నాము. ఇద్దరం పరస్పర అంగీకారంతోనే విడిపోతున్నాము. అలా అని మా మధ్యన ఇష్యూస్ ఏమీ లేవు..కలిసి సినిమాలు చేస్తాము..షికారుకి వెళతాము అని విచిత్రంగా చెప్పిన జంటలు చాలానే ఉన్నాయి.

is nayanatara-going to get married forcefully
is nayanatara-going to get married forcefully

అలా నయనతార కూడా ఈ విషయంలో దేశ వ్యాప్తంగా హాట్ టాపిక్ అయింది. ఆమె ఇటు తమిళం, అటు తెలుగు సినిమా ఇండస్ట్రీలలో స్టార్ హీరోయిన్‌గా కొనసాగుతుంది. చెప్పాలంటే ఇప్పుడున్న స్టార్ హీరోయిన్లకి గట్టి పోటీ ఇస్తోంది. ప్రేమ, సినిమాల ప్రమోషన్స్ విషయాలలో నయన్ ఎన్ని వివాదాల్లో ఇరుక్కున్నప్పటికీ కెరీర్‌ మాత్రం ఎక్కడా డామేజ్ కాకుండా జాగ్రత్త పడింది. ఇప్పటికే నయనతార రెండు సార్లు ప్రేమలో ఫెయిల్ అయింది. అయినప్పటికీ తన సినీ కెరీర్‌ మాత్రం దెబ్బ తినలేదు. అవకాశాల విషయంలో సమస్యలు ఎదుర్కోలేదు. ప్రస్తుతం కోలీవుడ్‌ డైరెక్టర్ విఘ్నేష్‌ శివన్‌తో ప్రేమలో మునిగితేలుతోంది. ఈ ప్రేమజంట తమ పుట్టినరోజు వేడుకలతో పాటు తమతమ ఇళ్ళలో జరిగే శుభకార్యాలకు ప్రైవేట్‌ జెట్‌లలో వెళ్ళి వస్తున్నారు. అంతేకాదు వీటికి సంబంధించిన ఫొటోలు సోషల్‌ మీడియాలో షేర్ చేయగా అవి వైరల్‌ అవుతున్నాయి.

Nayanatara : నయనతార – విఘ్నేష్‌ శివన్‌లు అధికారికంగా తమ పెళ్లి విషయాన్ని వెల్లడించే సూచనలు ఉన్నాయని అంటున్నారు.

ఈ నేపథ్యంలో రీసెంట్ గా ఈ స్టార్ కపుల్ చెన్నై నుంచి కొచ్చిన్‌కు స్పెషల్ జెట్‌లో వెళ్ళి వచ్చారు. ఈ టూర్‌కు సంబంధించిన వార్త ఒకటి హాట్ టాపిక్ గా మారింది. నయనతార తండ్రి అనారోగ్యంతో బాధ పడుతున్నారట. అందుకే ఉన్నపలంగా వీరు కొచ్చిన్‌కు వెళ్ళినట్టు చెప్పుకుంటున్నారు. తన కుమార్తెను పెళ్లి పీటల మీద చూడాలని నయనతార తండ్రి ఎప్పటి నుంచో ఆశపడుతున్నారు. కానీ నయనతార మాత్రం ఎప్పటికప్పుడు తన పెళ్ళిని వెనక్కి వేస్తూ వస్తోంది. అయితే ప్రస్తుతం ఆయన అనారోగ్యం బారినపడటంతో తండ్రి మాట కాదనలేక, పెళ్ళి చేసుకునేందుకు ఓకే చెప్పినట్టు తెలుస్తోంది. కానీ ఈ పెళ్ళి ఎప్పుడు, ఎక్కడ ఎలా జరగనుందనే విషయంలో మాత్రం పక్కా సమాచారం లేదు. అయితే విశ్వసనీయ వర్గాల ద్వారా అందుతున్న సమాచారం ప్రకారం త్వరలోనే నయనతార – విఘ్నేష్‌ శివన్‌లు అధికారికంగా తమ పెళ్లి విషయాన్ని వెల్లడించే సూచనలు ఉన్నాయని అంటున్నారు. దీన్ని బట్టి చూస్తే
త్వరలో నయన్ పెళ్లి పీటలెక్కబోతోందనమాట.

Stay on top of the game with the latest updates on Telugu latest news today! Experience the thrill of LIVE Telugu news updates like never before, only on Teluguonlinenews.com.

Mail

Published on జూలై 9, 2021 at 11:15 ఉద.