Nithya Menon : అలా మొదలైంది సినిమాతో టాలీవుడ్‌కి పరిచయమైన టాలెంటెడ్ హీరోయిన్ నిత్యా మీనన్. మలయాళ సినిమాలలో నటించి బాగా పాపులర్ అయిన ఈ బ్యూటీ సౌత్ సినిమా ఇండస్ట్రీలో బాగా క్రేజ్ సంపాదించుకుంది. తెలుగులో హీరోయిన్‌గా ఎంట్రీ ఇవ్వకముందు నిత్యా స్టార్ హీరోయిన్ టబుకు చెల్లిగా ఓ ఇంగ్లిష్ సినిమాలో బాలనటిగా నటించింది. ఆ తర్వాత మలయాళ మెగాస్టార్ మోహన్‌లాల్‌తో కూడా ఒక సినిమాలో నటించింది. నిత్యా మాతృ భాష మలయాళం. కానీ మిగతా సౌత్ భాషలలో నటించాలని, స్టార్ స్టేటస్ దక్కించుకోవాలని తెగ తాపత్రయ పడింది. ఆ తాపత్రయమే నిత్యాని ఈ రోజు సౌత్ అండ్ నార్త్ సినిమా ఇండస్ట్రీలలో స్టార్ హీరోయిన్ అయ్యేలా చేసింది.

is nithya-menon-troubled that star director....?
is nithya-menon-troubled that star director….?

నిత్యా మీనన్‌లో నటి మాత్రమే కాదు మంచి సింగర్ కూడా ఉంది. పాటలు పాడటం..సొంతగా డబ్బింగ్ చెప్పుకోవడం చాలా ఇష్టం. అందుకే తెలుగులో మొదటి సినిమా అయిన అలా మొదలైందిలోనే హీరోయిన్ గా నటించడంతో పాటు ఒక పాట కూడా పాడింది. ఏదో అనుకుంటే.. ఇంకేదో అయ్యిందే.., అబ్బబ్బో.. అబ్బో.. అంటూ సాగే రెండు పాటలు నిత్యా పాడినవే. ఈ రెండు పాటలు సూపర్ హిట్ అయ్యాయి. కేవలం తెలుగు సినిమాలలో మాత్రమే మలయాళ సినిమాల్లోనూ నటిస్తోంది. అక్కడ కూడా పాటలు పాడుతోంది. ఈ క్రమంలో ఒక పాటకు డాన్స్ కొరియోగ్రఫీ కూడా చేసింది.

Nithya Menon : మాటల మాంత్రీకుడు త్రివిక్రం శ్రీనివాస్ ని బాగానే ఇబ్బంది పెట్టిందట

అలా మొదలైంది తర్వాత సెగ, 180 వంటి చిత్రాలు చేసినా నిత్యా ఆ తర్వాత వచ్చిన ఇష్క్ సినిమాతో మంచి హిట్‌ అందుకుంది. మళ్లీ నితిన్‌తో నటించిన గుండెజారి గల్లంతయ్యిందే సినిమా బ్లాక్ బస్టర్ అందుకుంది. జబర్దస్త్, ఒక్కడినే, సన్నాఫ్ సత్య మూర్తి, గీత గోవిందం, ఏమిటో ఈ మాయ, మాలిని 22 లాంటి చిత్రాలతో పాటు, తమిళ, కన్నడ, హిందీ సినిమాల్లో కూడా నటిస్తోంది. అయితే నిత్యాకి కథ నచ్చకపోతే సినిమా ఒప్పుకోదు అనే టాక్ ఎప్పుడూ వినిపిస్తుంది. పాత్ర విషయంలో కూడా చాలా పక్కాగా ఉంటుందట. అందుకే సన్నాఫ్ సత్య మూర్తి సినిమా విషయంలో మాటల మాంత్రీకుడు త్రివిక్రం శ్రీనివాస్ ని బాగానే ఇబ్బంది పెట్టిందని, తన పాత్రలో కొన్ని మార్పులు చేయమని పట్టుపట్టినట్టు సోషల్ మీడియాలో బాగా వార్తలు వైరల్ అయ్యాయి. ఏదేమైనా ఈ సినిమాలో మాత్రం నిత్యకి రావాల్సిన పేరు రాలేదు.

Stay on top of the game with the latest updates on Telugu latest news today! Experience the thrill of LIVE Telugu news updates like never before, only on Teluguonlinenews.com.

Mail

Published on జూలై 11, 2021 at 10:06 ఉద.