Pawan Kalyan: కులరాజకీయాలకు కేరాఫ్ అడ్రస్ ఆంధప్రదేశ్. ఇక్కడ జనాలకు ఉన్న కులపిచ్చిని రాజకీయ పార్టీల నాయకులు ఇష్టమొచ్చినట్టు వాడుకుంటూ అధికారంలోకి రావడానికి ఎంతో మంది నాయకులు ప్రయత్నిస్తూ ఉన్నారు, గతంలో ఆలా ప్రయత్నం చేసి, అధికారంలోకి వచ్చిన వారు కూడా ఉన్నారు. అయితే ఇప్పుడు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా సేమ్ కుల ఫార్ములాను వాడుకోవాలని చూస్తున్నాడు. తన కులమైన కాపు ఓట్ల కోసం తెగ ప్రయత్నాలు చేస్తున్నారు. మొన్న జరిగిన 10వ ఆవిర్భావ సభలో నేరుగా కాపువాళ్ళ ఓట్లను అడుకున్నాడు. అయితే ఈ కుల ఓట్లకు పవన్ కళ్యాణ్ పెట్టుకున్న ముద్దు పేరేంటంటే “కులాలను ఏకం చెయ్యడం” . ఈ పేరును అడ్డుపెట్టుకొని ఇష్టమొచ్చినట్టు కులంపేరుతో ఓట్లు అడుగుతున్నాడు. అయితే ఇప్పుడు విచిత్రంగా వైసీపీ చేస్తున్న కుల రాజకీయాలను తప్పు పడుతూ పవన్ కళ్యాణ్ ట్వీట్ చేశాడు.

వైసీపీ కులాలను విడగొడుతుంది
వైసీపీ చేస్తున్న కుల రాజకీయాల గురించి ట్వీట్ లో ” రాష్ట్రంలో కులాల మధ్య అంతరాలు తగ్గించి…అందరి మధ్య సఖ్యత పెంచేందుకు జనసేన పార్టీ తపిస్తోందని, ఆ దిశగా అడుగులు వేస్తోందని పవన్ కళ్యాణ్ తెలిపారు. ఇందుకు భిన్నంగా అధికార వైసీపీ కుయుక్తులు పన్నుతోందని ఆరోపించారు. ఇందుకు సంబంధించి ఎప్పటికప్పుడు క్షేత్ర స్థాయి సమాచారం అందుతోందన్నారు. ఈ కుతంత్రాలు తిరుపతి నగరంలో మొదలయ్యాయని, బలిజలు, యాదవుల మధ్య సఖ్యతను విచ్ఛిన్నం చేసేలా కొందరు అధికార పార్టీ వ్యక్తులు చేస్తున్న రెచ్చగొట్టే చర్యలను ప్రతి ఒక్కరూ ఖండించాలన్నారు”. ఇలా వైసీపీ చేస్తున్న కుల రాజకీయాలను ఖండిస్తున్న పవన్ కళ్యాణ్ మాత్రం అవే కుల రాజకీయాలు తానూ చేస్తున్నానని మాత్రం మర్చిపోతున్నారు.
కులం పవన్ ను కాపాడుతుందా!!
ఇప్పటి వరకు ఏపీలో రాజకీయాలను ఏలడానికి పవన్ కళ్యాణ్ ఎన్నో ప్రయత్నాలు చేశారు. కానీ అవన్ని ఏవి వర్కౌట్ కాకపోవడం వల్లే ఇప్పుడు పవన్ కళ్యాణ్ కూడా కుల నినాదాన్ని ఎత్తుకున్నాడు. కులాలకు, మతాలకు అతీతంగా రాజకీయాలను చేస్తానని చెప్పిన, పవన్ ఇప్పుడు కాపు కులం పేరు చెప్పుకొని ఓట్లను అడ్డుకున్నే స్థాయి వచ్చాడు. అయితే మొదట్లో కులాన్ని పక్కనపెట్టి రాజకీయాలు చెయ్యాలని అనుకున్నాడు కానీ ఏపీలో జనాలకు కులపిచ్చి ఎక్కువ కాబట్టి అదే రాజకీయాలు చెయ్యడానికి జనసేన కూడా సిద్ధమైంది. అయితే ఈ కుల నినాదమైన పవన్ ను వచ్చే ఎన్నికల్లో గెలిపిస్తుందో లేదో చూడాలి.