Pooja Hegde: సినిమా ఇండస్ట్రీలో ఆధిపత్యపోరు ఉంటుందనే విషయం అందరికీ తెలిసిందే. భారీ స్థాయిలో పోటీ ఉండే పరిశ్రమలలో సినిమా పరిశ్రమ కూడా ఒకటి. ఇక్కడ కొత్త వాళ్ళను అంతగా ఎదగనివ్వరనే మాట తరచుగా వినిపిస్తుంటుంది. అంతేకాదు, ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీకి వచ్చి ఎదుగుతున్న వారిని స్టార్ కిడ్స్ డామినేట్ చేస్తుంటారనేది ఓ టాక్. ఇది నిజమా కాదా అనేది పక్కన పెడితే..అవకాశాలు మాత్రం ఎక్కువగా బ్యాక్ గ్రౌండ్ ఉన్న వాళ్ళకే వస్తాయనేది వాస్తవమని ఒప్పుకొని తీరాలి.
ఇప్పుడు ఇదే మోస్ట్ వాంటెడ్ బ్యూటీ పూజా హెగ్డేకు హిందీ సీమలో పెద్ద సమస్యగా మారిందని ఇటీవల పూజా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడిన దాన్ని బట్టి అర్థమవుతోంది. తెలుగు – హిందీ – తమిళంలో సినిమాలు చేస్తున్న పూజాకు మొత్తం కెరీర్లో ఇప్పటి వరకు దక్కిన హిట్స్ అంటే నాలుగు సినిమాలు మాత్రమే. ఈ నాలుగు హిట్స్‌తో మూడు ఇండస్ట్రీలలో క్రేజీ హీరోయిన్గా మారింది. దర్శక, నిర్మాతలు, హీరోలు ఏరి కోరి మరీ పూజాను తమ సినిమాలకు ఎంచుకుంటున్నారు.

Pooja Hegde: హిందీలో పూజా హెగ్డే ఎక్కువకాలం కొనసాగడం కష్టమా..?
అయితే, పూజాకు ముందు నుంచి బాలీవుడ్లో స్టార్ హోదా సంపాదించుకోవాలని తాపత్రయం ఉండేది. కానీ, ఆమెకు దక్కిన క్రేజ్, పాపులారిటీ, స్టార్ డమ్ అంతా కూడా టాలీవుడ్లోనే. అలాంటి టాలీవుడ్‌కు టాటా చెప్పాలనే ప్లాన్ కూడా వేసిందని ఇంతక ముందు వార్తలు వచ్చాయి. కానీ, బాలీవుడ్లో పూజా పాచికలు పారలేదు. అక్కడ ఆమెకు గట్టిగానే స్టార్ కిడ్స్ పోటీ ఇస్తున్నారు. ఈ నేపథ్యంలో హిందీలో పూజా హెగ్డే ఆశించిన పెద్ద సినిమా అవకాశాలు వస్తున్నా కూడా దక్కాల్సిన క్రేజ్ దక్కడం లేదనే విధంగా మాట్లాడింది. అందుకే, మళ్ళీ అమ్మడు ఎక్కువగా టాలీవుడ్ మీదే ఫోకస్ పెట్టినట్టు కూడా తన మాటలలో తెలుస్తోంది. దీన్ని బట్టి చూస్తే హిందీలో పూజా హెగ్డే ఎక్కువకాలం కొనసాగడం కష్టమని తెలుస్తోంది.