Prabhas : పాన్ ఇండియన్ స్టార్ ప్రభాస్ పెళ్ళి గురించే ఎప్పటికప్పుడు వార్తలు వస్తున్నాయి. మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్ అయిన ప్రభాస్ పెళ్ళి గత నాలుగేళ్ల క్రితమే జరగబోతోందని ప్రచారం జరిగింది. అయితే అప్పుడు ప్రభాస్ రాజమౌళి దర్శకత్వంలో బాహుబలి చేస్తున్నాడు. ఈ సినిమా కోసం దాదాపు నాలుగేళ్ళు సమయం కేటాయించాడు. ఈసినిమా పూర్తి చేశాక ప్రభాస్ పెళ్ళి ఉంటుందని అందరూ భావించారు. కానీ బాహుబలి పార్ట్ 2 రిలీజ్ కాకముందే సాహో సినిమాను కమిటయ్యాడు. ఈ సినిమా కోసం దాదపు రెండేళ్ళు సమయం కేటాయంచాడు. ఈ సినిమా తర్వా అయినా డార్లింగ్ పెళ్ళి చేసుకుంటాడనుకుంటే అసలు ఆ ఊసే లేకుండా నాలుగు పాన్ ఇండియన్ సినిమాలకి సైన్ చేసి షాకిచ్చాడు.

is prabhas marriage in 2023...?
is prabhas marriage in 2023…?

అయితే గత కొన్ని రోజులుగా ప్రభాస్ పెళ్లి ఉంటే 2023లో ఉండొచ్చని టాక్ వినిపిస్తోంది. ప్రస్తుతం ఆయన కమిటయిన నాలుగు సినిమాలను పూర్తి చేసే పనిలో ఉన్నాడు. వీటి తర్వాత ఈసారి ఖచ్చితంగా ప్రభాస్ పెళ్లి ఉంటుందని అంటున్నారు. ప్రస్తుతం రాధే శ్యాం సినిమా షూటింగ్ మరో 10 రోజులు మాత్రమే బ్యాలెన్స్ ఉంది. ఈ బ్యాలెన్స్ షూట్ కంప్లీట్ అయితే రిలీజ్‌కి సన్నాహాలు మొదలు పెట్టనున్నారు చిత్ర బృందం. అలాగే ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో సలార్ సినిమా చేస్తున్నాడు. ఇందులో డ్యూయల్ రోల్‌లో నటిస్తున్నట్టు సమాచారం. శృతి హాసన్ హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ సినిమాను ఈ ఏడాది షూటింగ్ పూర్తి చేసి వచ్చే ఏడాది రిలీజ్ చేయాలని చూస్తున్నారు.

Prabhas : ప్రభాస్ పెళ్లి విషయంలో అభిమానులను ఈసారైనా సర్‌ప్రైజ్ చేస్తాడా…?

ఇక బాలీవుడ్ స్ట్రైట్ మూవీ ఆదిపురుష్ కూడా శరవేగంగా షూటింగ్ సాగుతోంది. ప్రభాస్ లేకుండా మిగతా నటీ నటుల మీద సన్నివేశాలను తీస్తున్నారు. ఈ సినిమా 2022 ఆగస్టు 11న రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఈ మూడు సినిమాలు పూర్తి అయ్యాక వైజయంతీ మూవీస్ నిర్మించే సైన్స్ ఫిక్షన్ లో నటించనున్నాడు. ఇవన్నీ 2023 నాటికి పూర్తి చేయాలని ప్రభాస్ టార్గెట్ పెట్టుకున్నాడు. ఆ తర్వాత ఓ సంవత్సరం పాటు సినిమాలకి బ్రేక్ ఇవ్వాలనుకుంటున్నట్టు సమాచారం. ఆ బ్రేక్ తన పెళ్ళి కోసమేనని తెలుస్తోంది. ఇక ప్రభాస్ కోసం ఇప్పటికే అమెరికాలోని పెద్ద వ్యాపార వేత్త కుమార్తెను ఖాయం చేసి పెట్టుకున్నట్టు తెలుస్తోంది. మరి ప్రభాస్ పెళ్లి విషయంలో అభిమానులను ఈసారైనా సర్‌ప్రైజ్ చేస్తాడా లేక మళ్ళీ కొత్త ప్రాజెక్ట్స్ కమిటై షాకిస్తాడా చూడాలి.

Stay on top of the game with the latest updates on Telugu latest news today! Experience the thrill of LIVE Telugu news updates like never before, only on Teluguonlinenews.com.

Mail

Published on జూలై 8, 2021 at 12:00 సా.