Puri jagannaadh : పూరి జగన్నాధ్ ప్రస్తుతం లైగర్ సినిమాని తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం ముంబై లో శరవేగంగా సాగుతూ.. కరోనా కారణంగా బ్రేక్ పడింది. టాలీవుడ్ రౌడీ హీరో విజయ్ దేవరకొండ నటిస్తున్న ఈ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ అనన్య పాండే లైగర్ లో హీరోయిన్ గా నటిస్తోంది. విజయ్ దేవరకొండ బాక్సర్ గా కనిపించబోతున్నాడు. ఇక ఈ సినిమాకి పెట్టిన సాలా క్రాస్ బ్రీడ్.. ట్యాగ్ తో పూరి మార్క్ సినిమా.. పక్కా బ్లాక్ బస్టర్ అని అందరూ ఫిక్సైపోయారు. ఇక ఈ సినిమా సెప్టెంబర్ 9న రిలీజ్ చేయనున్నట్టు పోస్టర్ ని వదిలి ప్రకటించిన సంగతి తెలిసిందే.

is-puri-jagannaadh-getting-ready-for-that-movie-sequal

లైగర్ ఈ సినిమా గురించి టాలీవుడ్ అండ్ బాలీవుడ్ ప్రేక్షకులు ఎంతో ఆసక్తికరంగా ఎదురు చూస్తున్నారు. డైరెక్టర్ పూరి జగన్నాధ్ నుంచి ఇస్మార్ట్ శంకర్ లాంటి బ్లాక్ బస్టర్ తర్వాత రాబోతున్న సినిమా కావడంతో లైగర్ భారీ హిట్ అని అందరూ నమ్మకంగా చెప్పుకుంటున్నారు. ఇక విజయ్ దేవరకొండ గత చిత్రాలు కూడా ఫ్లాప్ గా మిగిలి ఉండటంతో ఈ సినిమా మీద నమ్మకాలన్ని పెట్టుకున్నాడు. ఇక ఈ సినిమా తెలుగు, హిందీ, తమిళ, మలయాళ, కన్నడ భాషల్లో తెరకెక్కుతుండగా ప్రముఖ నిర్మాణ సంస్థ పూరి కనెక్ట్స్, ధర్మ ప్రొడక్షన్స్‌ బ్యానర్స్ పై కరణ్ జోహార్, పూరి జగన్నాధ్ – ఛార్మీ సంయుక్తంగా నిర్మిస్తున్నారు.

Puri jagannaadh : పూరి జగన్నాధ్ నెక్స్ట్ సినిమాకి సన్నాహాలు మొదలు..?

కాగా పూరి జగన్నాధ్ నెక్స్ట్ సినిమాకి సన్నాహాలు మొదలు పెట్టినట్టు తాజా సమాచారం. లైగర్ రిలీజయ్యాక పూరి జగన్నాధ్ బ్లాక్ బస్టర్ సినిమా సీక్వెల్ ని తెరకెక్కించేందుకు సన్నాహాలు జరుగుతున్నాయట. ఆ సినిమానే ఇస్మార్ట్ శంకర్. రామ్, పూరి కాంబోలో వచ్చిన ఈ సినిమా ఇద్దరికి మంచి కం బ్యాక్ సినిమాగా నిలిచిన సంగతి తెలిసిందే. ఈ సినిమాతో రామ్ కి మాస్ హీరో ఇమేజ్ విపరీతంగా వచ్చింది. ఇస్మార్ట్ శంకర్ తర్వాత డబుల్ ఇస్మార్ట్ శంకర్ టైటిల్ ని కూడా రిజిస్టర్ చేయించి సీక్వెల్ ప్లాన్ చేశారు. కానీ అనుకోకుండా ఈ సీక్వెల్ పెండింగ్ పడింది. కాగా లైగర్ తర్వాత రామ్, పూరి కాంబోలో ఇస్మార్ట్ శంకర్ సీక్వెల్ సెట్స్ మీదకి రానున్నట్టు తెలుస్తోంది.

Stay on top of the game with the latest updates on Telugu latest news today! Experience the thrill of LIVE Telugu news updates like never before, only on Teluguonlinenews.com.

Mail

Published on ఏప్రిల్ 22, 2021 at 8:15 ఉద.