Radhe : ‘రాధే’.. బాలీవుడ్‌లో రీసెంట్‌గా రిలీజైన భారీ యాక్షన్ ఎంటర్‌టైనర్. సల్మాన్ ఖాన్, దిశా పఠాని జంటగా జాక్విలిన్ ఫెర్నాండస్ గెస్ట్ అపీరియన్స్‌లో నటించారు. ప్రముఖ కొరియోగ్రాఫర్, డైరెక్టర్ ప్రభుదేవా ఈ సినిమాకి దర్శకత్వం వహించాడు. బాలీవుడ్‌లో ప్రభుదేవా తెరకెక్కించిన యాక్షన్ ఎంటర్‌టైనర్స్ పెద్దగా మెప్పించలేకపోతున్నాయి. సల్మాన్ తో ఇంతకముందు దబాంగ్ 3 తెరకెక్కించాడు. ఈ సినిమా పెద్దగా మెప్పించలేకపోయింది. అయినా సల్మాన్ మళ్ళీ ఛాన్స్ ఇచ్చాడంటే అందరూ ఏదో మ్యాజిక్ చేస్తాడని ఫీలయ్యారు.

కానీ మ్యాజిక్ ఇలా జరుగుతుందని ఎవరూ ఊహించలేదు. కరోనా క్రైసిస్‌లో కూడా భాయ్ డేర్ చేసి రాధే ఓటీటీతో పాటు విదేశాలలో 700 స్క్రీన్స్ లో రిలీజ్ చేశాడు. మొదటి ఆట నుంచే డివైడ్ టాక్ ఆ తర్వాత ఫ్లాప్ టాక్ వచ్చింది. ఎక్కువగా దర్శకుడిని టార్గెట్ చేసి నెటిజన్స్ కామెంట్ చేస్తున్నారు. ఇలాంటి సినిమా తీస్తారని అనుకోలేదంటూ నెగిటివ్ కామెంట్స్ చేస్తున్నారు. అయితే సల్మాన్ క్రేజ్ వల్ల వసూళ్ళు మాత్రం బాగా ఉండటం విశేషం. మరి ఈ వసూళ్ళు ఇలానే ఉంటాయా లేద రెండు మూడు రోజులో డ్రాపవుతాయా చూడాలి.
Radhe : ‘రాధే’ సల్మాన్ ఖాన్‌కు ఫ్లాప్ సినిమాగా మిగిలింది అంటున్నారు.
ఇక తెలుగులో ఈ సినిమాను చూసిన చాలామంది ఇదో చెత్త సినిమా అంటూ కామెంట్స్ చేస్తున్నారు. దువ్వాడ జగన్నాథం లోని సీటీమార్ సాంగ్ రీమేక్ చేయడం కూడా చాలా మందికి నచ్చలేదు. అల్లు అర్జున్ రేంజ్ ఎలా ఉంటుందో అందరికీ తెలిసిందే. ఆయన డాన్స్ కి బాలీవుడ్ స్టార్స్ కూడా ఫిదా అయిపోయి ఫ్యాన్స్ అయ్యారు. అలాంటి సాంగ్‌లో సల్మాన్ వేసిన స్టెప్పులు అసలు బాగోలేవని ట్రోల్ చేస్తున్నారు. మొత్తానికి వసూళ్ళ సంగతి అలా ఉంచితే సల్మాన్ ఖాన్‌కు రాధే ఫ్లాప్ సినిమాగా మిగిలింది అంటున్నారు.