Rajeev kanakala : జూనియర్ ఎన్.టి.ఆర్ నిన్ను చూడాలని సినిమాతో హీరోగా మారాడు. ఈ సినిమా అంతగా పేరు తేకపోయినప్పటికి ఆ తర్వాత రాజమౌళి దర్శకుడిగా మారుతూ తెరకెక్కించిన సినిమా స్టూడెంట్ నంబర్ 1తో భారీ హిట్ అందుకున్నాడు. ఈ సినిమాతో ఎన్.టి.ఆర్ స్టార్ అయ్యాడు. గజాలా హీరోయిన్ గా నటించిన ఈ సినిమాకి దర్శకేంద్రుడు కె.రాఘవేంద్ర రావు దర్శకత్వ పర్యవేక్షణ చేశారు. ఎం.ఎం.కీరవాణి సంగీతం అందించారు. మ్యూజికల్ గానూ స్టూడెంట్ నంబర్ 1 మంచి హిట్ గా నిలిచింది. ఈ భారీ హిట్ సినిమాలో ప్రముఖ యాంకర్ సుమ భర్త రాజీవ్ కనకాల విలన్ పాత్రలో నటించాడు.

 

is rajeev-kanakala-takes care of junior ntr business
is rajeev-kanakala-takes care of junior ntr business

హీరోయిన్ ని ఏడిపించినప్పుడు తారక్ చేతిలో బాగా దెబ్బలు తినే పాత్రలో రాజీవ్ కనకాల కనిపించాడు. ఈ సినిమాలో రాజీవ్ కనకాల పోషించిన నెగిటివ్ రోల్ చాలా బాగా దెరు తీసుకువచ్చింది. అప్పటి వరకు బుల్లితెర మీద సీరియల్స్ చేస్తూ ఉన్న రాజీవ్ కి ఎన్.టి.ఆర్ నటించిన స్టూడెంట్ నంబర్ 1 మంచి బ్రేక్ ఇచ్చింది. ఈ సినిమాతో ఇండస్ట్రీ దృష్టిని ఆకర్శించిన రాజీవ్ కి బాగా పేరు రావడంతో వరుసగా అవకాశాలు వచ్చాయి. చాలా బిజీ ఆర్టిస్ట్ అయ్యారు. క్రమంగా బుల్లితెర మీద కనిపించడం మానేశాడు రాజీవ్ కనకాల. ఎన్.టి.ఆర్ నటించిన చాలా
సినిమాలలో కీలకపాత్ర పోషించాడు.

Rajeev kanakala : ప్రియమణికి అన్నగా నారప్పలో రాజీవ్ నటిస్తున్నట్టు సమాచారం.

ఇక స్టూడెంట్ నంబర్ 1 తర్వాత ఎన్.టి.ఆర్ – రాజీవ్ కనకాల మధ్య మంచి బాండింగ్ ఏర్పడింది. అప్పటి నుంచి మంచి స్నేహితులుగా కొనసాగుతున్నారు. అంతేకాదు ఎన్.టి.ఆర్ కి సంబంధించిన బిజినెస్‌లు కూడా రాజీవ్ కనకాల చూసుకుంటున్నాడని ఇండస్ట్రీ వర్గాలో చెప్పుకుంటారు. అయితే ఆ బిజినెస్ లు ఏంటనేవి మాత్రం బయటికి తెలియదు. రియల్ ఎస్టేట్ సహా మరికొన్ని వ్యాపారాలను రాజీవ్ కనకాల చూసుకుంటాడని అంటారు. ఇలా బిజినెస్ చూసుకుంటునే సినిమాలలో కీలక పాత్రలు పోషిస్తున్నారు. త్వరలో విక్టరీ వెంకటేశ్ -ప్రియమణి జంటగా నటించిన నారప్ప సినిమాలో కీలక పాత్రలో కనిపించబోతున్నారు. ప్రియమణికి అన్నగా నారప్పలో రాజీవ్ నటిస్తున్నట్టు సమాచారం.

Stay on top of the game with the latest updates on Telugu latest news today! Experience the thrill of LIVE Telugu news updates like never before, only on Teluguonlinenews.com.

Mail

Published on జూలై 15, 2021 at 12:00 సా.