Sekhar kammula : శేఖర్ కమ్ముల.. టాలీవుడ్‌లో తనకంటూ ఉన్న ప్రత్యేకత గురించి అందరికీ తెలిసిందే. డాలర్ డ్రీంస్ సినిమాతో సొంత నిర్మాణ సంస్థను స్థాపించి దర్శకుడిగానూ మారాడు. మొదటి సినిమా పెద్దగా ఎవరికీ తెలీదు. రెండవ ప్రయత్నంగా ఆనంద్ తీశాడు. మంచి కాఫీ లాంటి సినిమా అనే క్యాప్షన్ పెట్టాడు. రాజా హీరోగా నటించిన ఇందులో కమిలినీ ముఖర్జీ హీరోయిన్ గా నటించింది. ఆమెకి డెబ్యూ సినిమా. ఈ సినిమా రిలీజయిన వారానికి సూపర్ హిట్ టాక్ తెచ్చుకుంది. ఇలా కూడా సినిమా తీయొచ్చా..? ఇలాంటి సినిమాలను చూసేందుకు జనాలు థియేటర్స్ కి వస్తారా..?

is-sekhar-kammula-not-getting-chance-because-of-that-bad-quality
is-sekhar-kammula-not-getting-chance-because-of-that-bad-quality

ఇలాంటి ప్రశ్నలన్నిటికి ఆనంద్ సమాధనం ఇచ్చింది. శేఖర్ కమ్ముల ముందు ఈ సినిమాను పవన్ కళ్యాణ్‌తో తీయాలని ట్రై చేసినట్టు అప్పట్లో వార్తలు వచ్చాయి. ఆయన చేస్తే ఏ రేంజ్‌లో హిట్ అయ్యేదో తెలీదుగానీ రాజా లాంటి చిన్న హీరోతో సూపర్ హిట్ అందుకున్నాడు. 100 రోజులు ఆర్టీసి క్రాస్ రోడ్స్ లో ఈ సినిమా ప్రదర్శింపబడటం గొప్ప విషయం. ఈ సినిమా తర్వాత గోదావరి, హ్యాపీ డేస్ సినిమాలతో టాలీవుడ్‌లో అందరి దృష్టిని ఆకట్టుకున్నాడు. హ్యాపీడేస్ సినిమాను టాలీవుడ్ ప్రొడ్యుసర్ దిల్ రాజు సొంతగా డిస్ట్రిబ్యూట్ చేయడం ఈ సినిమా యూత్ అండ్ కాలేజ్ స్టూడెంట్స్ ను ఎంతగా ఆకట్టుకుందో అందరికీ తెలిసిందే.

Sekhar kammula : ‘లీడర్’ మహేష్, రజనీకాంత్, వెంకటేష్ లతో చేయాలనుకున్నాడా..!

లీడర్ సినిమాతో దగ్గుబాటి ఫ్యామిలీ నుంచి రానాను తెలుగు తెరకు పరిచయం చేశాడు. లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ యావరేజ్ కాగా ఫిదా తో బ్లాక్ బస్టర్ అందుకున్నాడు. సాయి పల్లవికి ఫిదా బ్యూటి అనే క్రేజ్ తీసుకు వచ్చాడు. అయితే శేఖర్ కమ్ముల స్టార్ హీరోలకి కథ చెప్పలేడని ఓపెన్ గా చెప్పడం విశేషం. ఐయాం ఏ బ్యాడ్ నెరేటర్.. నాకు స్టోరీ నరేట్ చేయడం రాదు. నేను స్టోరీ చెప్పే విధానానికి స్టార్స్ ఎవరూ ఛాన్స్ ఇవ్వరంటూ సరాదా కామెంట్స్ కూడా తన మీద తనే వేసుకున్నాడు. ఇక లీడర్ సినిమాను మహేష్ బాబు, రజనీకాంత్, వెంకటేష్ లతో చేయాలనుకుని ఫైనల్‌గా రానాతో చేసినట్టు చెప్పుకుంటారు. కాగా త్వరలో ఆయన దర్శకత్వంలో తెరకెక్కిన లవ్ స్టోరి రిలీజ్ కి రెడీగా ఉంది. నాగ చైతన్య – సాయి పల్లవి జంటగా నటించారు. సారంగ దరియా సాంగ్ సెన్షేషన్ క్రియేట్ చేస్తోంది.

Stay on top of the game with the latest updates on Telugu latest news today! Experience the thrill of LIVE Telugu news updates like never before, only on Teluguonlinenews.com.

Mail

Published on మే 25, 2021 at 10:06 సా.