Mahesh babu : సూపర్ స్టార్ మహేష్ బాబు పరశురాం దర్శకత్వంలో ప్రస్తుతం సర్కారు వారి పాట సినిమా చేస్తున్నాడు. కీర్తి సురేష్ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ సినిమాని 14రీల్స్ ప్లస్, మైత్రీ మూవీ మేకర్స్‌తో కలిసి మహేష్ సొంత నిర్మాణ సంస్థ జీఎంబీ ఎంటర్‌టైన్మెంట్స్ బ్యానర్‌పై నిర్మిస్తున్నాడు. బ్యాంకింగ్ రంగలో జరుగుతున్న భారీ కుంభకోణాల నేపథ్యంలో తెరకెక్కుతోంది. ఈ సినిమా వచ్చే ఏడాది సంక్రాంతికి రిలీజ్ చేయబోతున్నారు. సూపర్ స్టార్ కృష్ణ బర్త్ డే అయిన ఈ నెల 31న సర్కారు వారి పాట సినిమా నుంచి భారీ సర్‌ప్రైజ్ రానుంది.

is-shilpa-shetty-in-mahesh-babu
is-shilpa-shetty-in-mahesh-babu

ఇక దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబోలో హ్యాట్రిక్ సినిమా తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. గతంలో అతడు, ఖలేజా సినిమాలు రాగా ఇప్పుడు పాన్ ఇండియన్ సినిమా ఈ ఇద్దరి కాంబినేషన్‌లో రాబోతుండటం దేశ వ్యాప్తంగా అంచనాలు మొదలయ్యాయి. ఎప్పుడైతే ఈ కాంబోలో పాన్ ఇండియన్ సినిమా ప్రకటించారో కథ.. హీరోయిన్…మ్యూజిక్ డైరెక్టర్ సహా త్రివిక్రమ్ పెట్టాలనుకునే టైటిల్ గురించి జోరుగా చర్చలు సాగుతున్నాయి.

Mahesh babu : మహేష్ బాబు సినిమాలో శిల్పాశెట్టికి గొప్ప పాత్ర..?

కాగా ఈ ప్రాజెక్ట్‌లోకి బాలీవుడ్ సీనియర్ హీరోయిన్ శిల్పాశెట్టిని తీసుకు రాబోతున్నాడట త్రివిక్రమ్. బాలీవుడ్ స్టార్ హీరోయిన్‌గా శిల్పాశెట్టి ఒక వెలుగు వెలిగింది. తెలుగులోనూ వెంకటేష్, నాగార్జున సినిమాలు చేసి సూపర్ హిట్స్ అందుకుంది. మళ్ళీ చాలా ఏళ్లకి టాలీవుడ్ ఎంట్రీ ఇవ్వబోతుందనే వార్త అభిమానులకు ప్రేక్షకులకు ఉత్సాహాన్నిస్తోంది. ఇప్పటి వరకు అత్తారింటికి దారేది, అ.. ఆ లలో నదియా.. ‘సన్నాఫ్ సత్యమూర్తి’లో స్నేహ.. ‘అజ్ఞాతవాసి’లో ఖుష్బూ.. ‘అరవింద సమేత వీర రాఘవ’ సినిమాలో దేవయాని.. ‘అల..’లో టబు పాత్రను అద్బుతంగా మలిచి సీనియర్ నటులకు క్రేజ్ తెచ్చిపెట్టాడు త్రివిక్రమ్. ఇప్పుడు శిల్పాశెట్టికి గొప్ప పాత్ర తయారు చేస్తున్నాడని సమాచారం.

Stay on top of the game with the latest updates on Telugu latest news today! Experience the thrill of LIVE Telugu news updates like never before, only on Teluguonlinenews.com.

Mail

Published on మే 13, 2021 at 10:30 సా.